Malavika Avinash: కేజీఎఫ్ నటికి నోటీసులు.. బెదిరింపు కాల్స్ చేసిందని ఆరోపణ.. అసలు విషయం ఏంటంటే

మాళవిక అవినాష్ చాలా మందికి బెదిరింపు మెసేజ్ లు, కాల్స్ పంపిందని ట్రాయ్ ఆరోపించింది. ట్రాయ్ ఇచ్చిన నోటీసు పై సోషల్ మీడియాలో అసలు విషయం గురించి మాళవిక అవినాష్ వివరిస్తూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సందేశం కూడా ఇచ్చారు. కొడగులో తన కుటుంబంతో కలిసి ఉంటుంది మాళవిక.

Malavika Avinash: కేజీఎఫ్ నటికి నోటీసులు.. బెదిరింపు కాల్స్ చేసిందని ఆరోపణ.. అసలు విషయం ఏంటంటే
Malavika Avinash
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 04, 2023 | 12:38 PM

మాళవిక అవినాష్‌.. కేజీఎఫ్ సినిమా చూసిన వారికి ఈమె గుర్తుండే ఉంటుంది. మాళవిక అవినాష్‌ నటి మాత్రమే కాదు బీజేపీ నాయకురాలు కూడా. తాజాగా మాళవిక అవినాష్‌కు ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నోటీసులు జారీ చేసింది. మాళవిక అవినాష్ చాలా మందికి బెదిరింపు మెసేజ్ లు, కాల్స్ పంపిందని ట్రాయ్ ఆరోపించింది. ట్రాయ్ ఇచ్చిన నోటీసు పై సోషల్ మీడియాలో అసలు విషయం గురించి మాళవిక అవినాష్ వివరిస్తూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సందేశం కూడా ఇచ్చారు. కొడగులో తన కుటుంబంతో కలిసి ఉంటుంది మాళవిక. ఆమె పలు సినిమాలతో కన్నడ ఇండస్ట్రీలో మంచు గుర్తింపు తెచ్చుకుంది. కేజీఎఫ్ 1, 2 లో నటించి పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

ఇటీవల మాళవికకు ట్రాయ్ ఫోన్ చేసి చాలా మందికి బెదిరింపు సందేశాలు పంపడంతో ఆమె మొబైల్ సిమ్ డియాక్టివేట్ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో అవాక్కయిన మాళవిక అసలేం జరిగిందో అడిగి తెలుసుకుంది. మాళవిక అవినాష్‌ ఆధార్‌ కార్డుతో ముంబైలో ఓ అజ్ఞాత వ్యక్తి సిమ్‌కార్డు కొనుగోలు చేసి అదే నంబర్‌ నుంచి పలువురికి బెదిరింపు కాల్‌లు, మెసేజ్‌లు చేసినట్లు తెలిసింది. బెదిరింపు మెసేజ్‌లు రావడంతో ఆ నంబర్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ట్రాయ్ దృష్టికి వచ్చి ఆ సిమ్‌కు సంబంధించిన సమాచారం కోసం వెతికినప్పుడు అది మాళవిక అవినాష్ ఆధార్ కార్డు ద్వారా పొందిన సిమ్ అని తెలిసింది.

ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న మాళవిక అవినాష్, ఫోటో ఉన్న డాక్యుమెంట్‌ను మరొకరు ఎలా ఉపయోగిస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేసుపై ఫిర్యాదు చేయడానికి ముంబైకి వెళ్లడానికి నిరాకరించిన మాళవిక అవినాష్ స్టేట్‌మెంట్ దాఖలు చేశారు. వీడియో కాల్ ద్వారా ముంబై పోలీసులతో మాట్లాడి మాళవిక ఫిర్యాదు చేసింది.  దాంతో పోలీసులు ఆమె పేరుపై అక్రమంగా జారీ చేసిన సిమ్‌ను రద్దు చేశారు. ఆధార్ సమాచారం లీకేజీపై ఆందోళన వ్యక్తం చేసిన మాళవిక ప్రైవేట్ సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా ప్రజలను కోరారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.