Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumar Death: ‘అప్పు’ పునీత్ హఠాన్మరణంతో శోఖసంద్రంలో మునిగిపోయిన అభిమానులు..

కన్నడ పవర్ స్టార్ గా అంతులేని అభిమానులను సొంతం చేసుకున్న హీరో పునీత్ రాజ్ కుమార్. పునీత్ రాజ్‌కుమార్ (17 మార్చి 1975  జన్మించారు.

Puneeth Rajkumar Death: 'అప్పు' పునీత్ హఠాన్మరణంతో శోఖసంద్రంలో మునిగిపోయిన అభిమానులు..
Puneeth
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 29, 2021 | 3:23 PM

Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్‌గా అంతులేని అభిమానులను సొంతం చేసుకున్న హీరో పునీత్ రాజ్ కుమార్. పునీత్ రాజ్‌కుమార్ 17 మార్చి 1975న జన్మించారు. నటుడు, నేపథ్య గాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, నిర్మాత గా ప్రతిభను చాటుకున్నాడు పునీత్. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్. పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది. ఈ రోజు ఉడయం జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటు రావడంతో ఆయనను బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పునీత్‌ రాజ్‌ కుమార్‌ మృతిచెందారు. ఇప్పటివరకు పునీత్ 29 సినిమాలలో నటించారు. వసంతగీత (1980), భాగ్యవంత (1981), చలిసువ మొదగలు (1982), ఏడు నక్షత్రాలు (1983), భక్త ప్రహ్లాద, యరివాను బెట్టాడ హూవు (1985) చిత్రాల్లో అద్భుత నటనను కనబరిచి అందరిచేత ప్రశంసలు అందుకున్నారు పునీత్.

బెట్టాడ హూవులో రాముడి పాత్రకు ఉత్తమ బాలనటిగా జాతీయ చలనచిత్ర అవార్డు, చలీసువ మొదగలు మరియు ఏరడు నక్షత్రాలు చిత్రాలకు ఉత్తమ బాలనటుడిగా కర్ణాటక రాష్ట్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు పునీత్ పునీత్ ప్రధాన పాత్రలో 2002లో వచ్చిన అప్పు అనే సినిమా వచ్చింది ఈ సినిమా ఎం,మంచి విజయాన్ని అందుకుంది. డిసెంబర్‌ 1,1999లో అశ్విని రేవంత్‌ను పెళ్ళి చేసుకున్నాడు పునీత్‌ రాజ్‌ కుమార్‌. వారికి ఇద్దరు కుమార్తెలు దృతి, వందిత.

పునీత్ రాజ్ కుమార్ నటించిన సినిమాలు.. అప్పు (2002), అభి (2003), వీర కన్నడిగ (2004), మౌర్య (2004), ఆకాష్ (2005), అజయ్ (2006), అరసు (2007), మిలనా వంటి వాణిజ్యపరంగా వంశీ (2008), రామ్ (2009), జాకీ (2010), హుడుగారు (2011), రాజకుమార (2017), మరియు అంజనీ పుత్ర (2017) సినిమాలలో నటించారు పునీత్‌ రాజ్‌కుమార్‌. పునీత్ ఒక్కో సినిమాకు దాదాపు 2.07 కోట్ల తీసుకుంటున్నట్లు అంచనా .. సక్సెస్ ఫుల్ గా 10కి పైగా వరుస హిట్ సినిమాలను అందించిన ఏకైక కన్నడ నటుడు పునీత్. పునీత్ నటించిన చిత్రం మిలనా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే పునీత్ “వంశీ” సినిమా విజయవంతంగా  బెంగళూరులోని చాలా మల్టీప్లెక్స్‌లలో ఏడాదిపాటు ఆడింది. కన్నడలో 2012లో పునీత్ హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్? అనే గేమ్ షో తో ఆకట్టుకున్నాడు కన్నడ కోట్యాధిపతిలో టెలివిజన్ ప్రెజెంటర్‌గా అరంగేట్రం చేశారు. పునీత్‌కు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు, అతని కుటుంబం మైసూర్‌కు వెళ్లింది. పునీత్ రాజ్ కుమార్, సోదరి పూర్ణిమను పదేళ్ల వయస్సు వరకు తన సినిమా సెట్స్‌కి తీసుకువచ్చేవాడు తండ్రి . పునీత్ అన్నయ్య శివ రాజ్‌కుమార్ కూడా ప్రముఖ నటుడు.

బాల నటుడిగా దర్శకుడు V. సోమశేఖర్ తెరెకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ప్రేమద కనికే (1976) ఆరతిలో ఆరు నెలల వయస్సులో పునీత్ (అప్పట్లో లోహిత్ అని పిలుస్తారు) నటించాడు. ఆతర్వాత విజయ్ సనాది అప్పన్న (1977), తల్లిగే తక్క మగా (1978) , వి. సోమశేఖర్ తండ్రి దర్శకత్వంలో రెండేళ్ల వయసులో దర్శకులు దొరై-భగవాన్ వసంతగీత (1980)లో శ్యామ్‌గా , K. S. L. స్వామి పౌరాణిక నాటకం భూమిగే బండ భగవంత (1981, లార్డ్ కృష్ణ) గా.. B. S. రంగా తెరకెక్కించిన భాగ్యవంత (1982) లో పునీత్ ఉత్తమ బాల నటుడిగా తన మొదటి కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నాడు. అలాగే 1983లో   రెండు పౌరాణిక చిత్రాలలో కనిపించాడు పునీత్. కథానాయకుడిగా, ప్రహ్లాద, ఎరడు నక్షత్రాలు , ఉత్తమ బాలనటుడిగా తన రెండవ కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నాడు పునీత్.

1984లో పునీత్ థ్రిల్లర్ యారివనులో రాజ్‌కుమార్‌తో కలిసి నటించారు. రాజన్ – నాగేంద్ర రాసిన “కన్నిగే కానువా” అనే పాట కూడా పాడారు పునీత్. అలాగే 1985లో N. లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన బెట్టాడ హూవు అనే నాటకంలో అమాయక రాముడి పాత్రకు పునీత్ 33వ జాతీయ చలనచిత్ర అవార్డును సొంతం చేసుకున్నాడు. పునీత్ రాజ్ కుమార్ చివరగా యువరత్న అనే సినిమాలో నటించారు. పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంతో కన్నడ ప్రేక్షకులతోపాటు అనీ ఇండస్ట్రీలు దిగ్బ్రాంతికి గురయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shruti Sharma: చూపులతో కైపెక్కిస్తున్న ఏజెంట్ భామ శ్రుతి శర్మ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..

Puneeth Rajkumar Death: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి.. షాక్‏లో సినీ పరిశ్రమ..