AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నాన్నకు ప్రేమతో.. సొంత ఖర్చులతో 101 మందిని కాశీ యాత్రకు తీసుకెళ్లిన టాలీవుడ్ విలన్.. ప్రశంసల జల్లు

'స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని మా నాన్నను విమానంలో కాశీ యాత్రకు పంపడానికి టికెట్ బుక్ చేశాను. ఇంటికి వచ్చి అదే విషయం ఆయనకు చెప్పాను. కానీ దురదృష్టవశాత్తూ ఈ విషయం చెప్పిన కొన్ని గంటలకే నాన్న కన్నుమూశారు. ఇది ఇంకా నన్ను వెంటాడుతోంది' అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడీ ప్రముఖ నటుడు

Tollywood: నాన్నకు ప్రేమతో.. సొంత ఖర్చులతో 101 మందిని కాశీ యాత్రకు తీసుకెళ్లిన టాలీవుడ్ విలన్.. ప్రశంసల జల్లు
Kashi Yatra
Basha Shek
|

Updated on: Jul 19, 2025 | 7:17 PM

Share

చూడడానికి అచ్చం బాహుబలిలా కనిపించే ఈ నటుడు ప్రముఖ బాడీ బిల్డర్ కూడా. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో 300 కి పైగా అవార్డులు అందుకున్నాడు. ఇక సుమరు 30 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో సుమారు 140కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే సినిమాలతో పాటు తన సామాజిక సేవా కార్యక్రమాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇప్పుడు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సొంత ఖర్చులతో 101 మందికి పవిత్రమైన కాశీ యాత్రకు తీసుకెళ్లాడు. వారికి ఎలాంటి లోటు పాట్లు రాకుండా దగ్గరుండి మరీ కాశీ విశ్వేశ్వరుడిని దర్శనం చేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. ఇలా తన గొప్ప మనసుతో వార్తల్లో నిలిచిన ఈ నటుడు మరెవరో కాదు ప్రముఖ బాడీ బిల్డర్ జిమ్ రవి. కర్ణాటక , ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 101 మందిని ఎంపిక చేసుకున్న జిమ్ రవి వారిని తన సొంత ఖర్చులతో కాశీ యాత్రకు తీసుకెళ్లాడు. అలాగే అయోధ్య రాముడి దర్శనం కూడా చేయించాడు.

మొదట 101 మంది యాత్రికులు తమ స్వస్థలాల నుండి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోవడానికి వాహనాలను ఏర్పాటు చేశాడు జిమ్ రవి. ఆ తర్వాత విమానాశ్రయంలో అల్పాహారం అందించిన తర్వాత నేరుగా వారిని అయోధ్యకు తీసుకెళ్లాడు. అక్కడ భక్తులందరికీ కొత్త వస్త్రాలు ఇప్పించి రాముని దర్శనం చేయించాడు. ఆ తర్వాత అయోధ్య నుంచి ప్రత్యేక బస్సులో యాత్రికులను కాశీకి తీసుకెళ్లాడు. అక్కడ 101 మంది బృందం బస చేయడానికి ఏసీ గదులు ఏర్పాటు చేశారు. అల్పాహారం, రాత్రి భోజనం అక్కడే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత స్వామి వారి ప్రత్యేక దర్శనం కూడా చేయించారు. ఇక కాశీలో నిత్యం జరిగే గంగా హారతిలోనూ భక్తులు పాల్గొనేలా ఏర్పట్లు చేశాడు. జిమ్ రవి సహకారంతో భక్తులందరూ కాశీలోని అన్నపూర్ణ ఆలయంతో సహా వివిధ దేవాలయాలను సందర్శించారు. గంగా నది ఒడ్డున యాత్రికులు పిండప్రదానాన్ని కూడా చేశారు.

ఇవి కూడా చదవండి

కాశీ యాత్రికులతో నటుడు జిమ్ రవి..

దర్శనం తర్వాత భక్తుల షాపింగ్ ఖర్చుల కోసం రవి స్వయంగా కొంత డబ్బు ఇచ్చాడు. ఇదంతా చూసి యాత్రికులు చలించిపోయి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. రవి, అతని కుటుంబ సభ్యులను మనసారా ఆశీర్వదించారు. రవి తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇక ఈ ఆధ్యాత్మిక యాత్ర తర్వాత భక్తులందరూ వారి స్వస్థలాలకు వెళ్లడానికి అనుకూలమైన వాహనాలను ఏర్పాటు చేసినట్లు జిమ్ రవి బృందం తెలియజేసింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .