- Telugu News Photo Gallery Cinema photos Mrs.World International 2025 Season 3 Meenaz Babu Crowned as a Winner With 2 Titles
Mrs. World International 2025 : ఘనంగా మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ వేడుకలు.. సత్తా చాటిన హైదరాబాద్ మహిళ..
మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2025 సీజన్ 3 వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గుర్గావ్‌లోని లీలా యాంబియెన్స్ మాల్‌లో ఈ వేడుకలు మరింత గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఏడాది మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఎడిషన్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈసారి గ్లామర్ గుర్గావ్ 11 ఐకానిక్ సంవత్సరాలను సూచిస్తుంది.
Updated on: Jul 19, 2025 | 7:10 PM

మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2025.. ప్రపంచ వేదికపై వేలాది మంది మహిళల కలలను సాకారం చేయడానికి వారదిగా ఉండే అంతర్జాతీయ అందాల పోటీ. విభిన్న రంగాల నుంచి దాదాపు 100 మందికి పైగా నిష్ణాతులైన ఫైనలిస్టులను ఒకచోట చేర్చిన ఈ వేడుక మహిళల ధైర్యం, వారి కలలు నిజం చేసే సారధి.

ఈ అందాల పోటీలలో వైద్యులు, వ్యవస్థాపకులు, ఉపాధ్యాయులు, కళాకారులు, గృహిణులు ఎంతో మంది పాల్గొన్నారు. తాము చేరాలనుకున్న గమ్యాలకు వయసు, వైవాహిక జీవితం, కుటుంబ నేపథ్యం తమ ఆశయానికి అడ్డంకులు కాదని వందలాది మంది మహిళలు మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ వేడుకల ద్వారా నిరూపించారు.

ఈ వేడుకలలో హైదరాబాద్ గృహిణి మీనాజ్ బాను సత్తా చాటారు. 3వ రన్నరప్ ఛార్మింగ్ మహిళగా అవార్డ్ గెలుచుకుంది. అలాగే గ్లామర్ లుక్ లోనే మరో టైటిల్ కైవలం చేసుకున్నారు మీనాజ్ బాను. దాదాపు రూ.150 మంది మహిళలు ఈ వేడుకలలో పార్టిసిపేట్ చేయగా.. ఇండియా, అబ్రాడ్ నుంచి మీనాజ్ బాను పాల్గొన్నారు.

ఈ వేడుకలలో టాప్ 15లో చోటు దక్కించుకున్న మీనాజ్ బాను.. ఆ తర్వాత టాప్ 5లో ఒకరిగా నిలిచారు. ఈ వేడుకలలో 3వ రన్నరప్ గా నిలవడమే కాకుండా ఛార్మింగ్, గ్లామర్ లుక్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. తన చిన్ననాటి కల చివరకు నిజమైందని.. ఆ విషయంలో తాను ఎంతో గర్వపడుతున్నానని అన్నారు మీనాజ్ బాను.

మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ వేడుకలలో తనతోపాటు ర్యాంప్ పై పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2025 సీజన్ 3 లో అంకితా మీనన్ (మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2025 చార్మింగ్), నజియా ఖాన్ (శ్రీమతి వరల్డ్ ఇంటర్నేషనల్ 2025 రవిషింగ్) విజేతలుగా నిలిచారు.




