- Telugu News Photo Gallery Cinema photos Know Nayanthara Rejects This Hero 100 Crore Movie Offer For This Reason, Know Who is He
Nayanthara: రూ.100 కోట్లు ఇచ్చినా ఈ హీరోతో అస్సలు నటించను.. నయనతార షాకింగ్ కామెంట్స్..
లేడీ సూపర్ స్టార్ నయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆమె నటనకు, అందానికి మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఆమె సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. స్టార్ హీరోస్ సైతం నయన్ డేట్స్ కోసం ఎదురుచూస్తుంటరు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న హీరోయిన్.
Updated on: Jul 19, 2025 | 7:35 PM

లేడీ సూపర్ స్టార్ నయనతార.. పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఆమె ఒకరు. తెలుగుతోపాటు తమిళం, హిందీలోనూ వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న కొత్త ప్రాజెక్టులో నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.అయితే రూ.100 కోట్లు ఇచ్చినప్పటికీ ఓ హీరోతో నటించనని ముఖం మీదే చెప్పేసిందట నయన్. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. ?

ప్రస్తుతం చిరంజీవితోపాటు కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రంలోనూ నటిస్తుంది. ఇవే కాకుండా తమిళంలో మరిన్ని సినిమాలకు సైతం నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో నటించనని చెప్పేసిందట నయన్. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. అతడే శరవణన్.

ది లెజెండ్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు శరవణన్. 2022లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే తన సినిమాలో నయనతారను కథానాయికగా తీసుకోవాలని భావించాడట. కానీ ఆ సినిమా అవకాశాన్ని నయన్ సున్నితంగా రిజెక్ట్ చేసిందని సమాచారం.

ది లెజెండ్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు శరవణన్. 2022లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే తన సినిమాలో నయనతారను కథానాయికగా తీసుకోవాలని భావించాడట. కానీ ఆ సినిమా అవకాశాన్ని నయన్ సున్నితంగా రిజెక్ట్ చేసిందని సమాచారం.




