- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress Who Entered In Films as Child Artist and Debut as Heroine At age Of 15, She Is Hansika
Actress : 15 ఏళ్లకే తెలుగులో స్టార్ హీరోయిన్.. స్నేహితురాలి భర్తనే ప్రేమించి పెళ్లి.. ఇప్పుడు ఇలా..
సినీతారలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నిజానికి బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆ చిన్నది.. ఆ తర్వాత కథానాయికగా సత్తా చాటింది. ఇప్పుడు వరుస సినిమాలతో రాణిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..
Updated on: Jul 19, 2025 | 6:09 PM

చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. కెరీర్ మొదట్లో హిందీలో స్టార్ హీరోల సినిమాల్లో బాలనటిగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ 15 ఏళ్లకే కథానాయికగా తెరంగేట్రం చేసింది. తెలుగులో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా హిట్టు కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుంది. అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? అందంలో ఆమె అప్సరస. ఇప్పుడు వందల కోట్లకు యజమాని.

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ హాన్సిక మోత్వానీ. తెలుగులో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా సమయంలో హాన్సిక వయసు కేవలం 15 ఏళ్లు కావడం గమనార్హం.

ఈ సినిమా తర్వాత తెలుగులో కంత్రి, బిల్లా, మస్కా, కందిరీగ, పవర్, తెనాలి రామకృష్ణ, మై నేజ్ ఈజ్ శ్రుతి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఎక్కువగా తమిళం, హిందీలో అవకాశాలు అందుకుంటుంది హన్నిక.

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం రాజస్థాన్ జైపూర్ లో జరిగింది. సోహైల్ కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. నివేదికల ప్రకారం హన్సిక ఆస్తులు రూ.120 కోట్లకు పైగా ఉన్నట్లు సమచారం.




