Kangana Ranaut: మళ్లీ ప్రభాస్ జోడిగా కంగనా.. పాన్ ఇండియా ప్రాజెక్టులో బీటౌన్ బ్యూటీ ?..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. సూపర్ స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్రలలో కనిపించనున్నారు. ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే కన్ఫార్మ్ అయ్యింది. అలాగే శివయ్య భక్తుడు కన్నప్ప పాత్రలో మంచు విష్ణు కనిపించనున్నారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది... కానీ ఇందులోని నటీనటుల గురించి ఇప్పటివరకు పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించలేదు. ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..

Kangana Ranaut: మళ్లీ ప్రభాస్ జోడిగా కంగనా.. పాన్ ఇండియా ప్రాజెక్టులో బీటౌన్ బ్యూటీ ?..
Prabhas, Kangana Ranaut
Follow us

|

Updated on: Feb 22, 2024 | 10:03 PM

ప్రస్తుతం సినీ పరిశ్రమలో అత్యంత భారీ అంచనాలున్న సినిమాల్లో కన్నప్ప ఒకటి. టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. బుల్లితెరపై మహాభారతం సీరియల్ రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. సూపర్ స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్రలలో కనిపించనున్నారు. ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే కన్ఫార్మ్ అయ్యింది. అలాగే శివయ్య భక్తుడు కన్నప్ప పాత్రలో మంచు విష్ణు కనిపించనున్నారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది… కానీ ఇందులోని నటీనటుల గురించి ఇప్పటివరకు పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించలేదు. ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీలో పార్వతి దేవి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కనిపించనుందని టాక్. ఇప్పుడిదే విషయం సోషల్ మీడియాలో మారుమోగుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో పార్వతి దేవి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కనిపించనుందని టాక్. ఇందులో శివుడిగా ప్రభాస్.. పార్వతి దేవిగా కంగనా కనిపించనుందని అంటున్నారు. అందులో ఎంతవరకు నిజమనేది క్లారిటీ రాలేదు. కానీ కన్నప్ప సినిమాలో కంగనా నటించనుందనే విషయం మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది. ప్రభాస్, కంగనా కలిసి గతంలో ఏక్ నిరంజన్ సినిమాలో నటించారు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రభాస్, కంగనా రనౌత్, సోనూ సూద్, ముకుల్ దేవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2009లో విడుదలైంది.

ఇక ఇప్పుడు దాదాపు 16 ఏళ్ల తర్వాత మరోసారి వీరిద్దరు కలిసి నటించనున్నారు. ఈ వార్తలను మేకర్స్ ఇంకా ధృవీకరించలేదు. ప్రభాస్‌కు జోడీగా పార్వతీ దేవి పాత్రలో నయనతార నటిస్తుందని గతంలో ఊహాగానాలు వినిపించాయి. కంగనా రనౌత్ దేవత వేషంలో ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో కన్నప్ప సినిమా రూపొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు భారతీయ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ, స్టీఫెన్ దేవస్సీ సంయుక్తంగా మ్యూజిక్ అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!