Kamalinee Mukherjee: తెలుగు సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్న కమలినీ ముఖర్జీ.! చరణ్ సినిమానే కారణమా?
హీరోయిన్గా మొదటి సినిమాతోనే అభిమానుల దృష్టిని ఆకర్షించి, గొప్ప ఆదరణ పొందిన హీరోయిన్లు కొందరు.. ఆ తర్వాత ఊహించని కారణాల వల్ల సినిమా పరిశ్రమకు దూరమవుతుంటారు. మళ్లీ వారు ఎప్పుడు రీ-ఎంట్రీ ఇస్తారా అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. ఈ కోవకు చెందిన ఒక ..

హీరోయిన్గా మొదటి సినిమాతోనే అభిమానుల దృష్టిని ఆకర్షించి, గొప్ప ఆదరణ పొందిన హీరోయిన్లు కొందరు.. ఆ తర్వాత ఊహించని కారణాల వల్ల సినిమా పరిశ్రమకు దూరమవుతుంటారు. మళ్లీ వారు ఎప్పుడు రీ-ఎంట్రీ ఇస్తారా అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. ఈ కోవకు చెందిన ఒక నటి… తెరపై చూసి ఆరాధించిన అభిమానులకు, చాలాకాలం తర్వాత ఆమెను చూసినప్పుడు ఆమె రూపురేఖలు మారిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ నటి మరెవరో కాదు, ‘ఆనంద్’, ‘గోదావరి’ వంటి తెలుగు సినిమాలతో గుర్తింపు పొందిన కమలిని ముఖర్జీ.
నంది అవార్డుతో మొదలైన కెరీర్..
కమలిని ముఖర్జీ తన కెరీర్‌ను 2004లో శిల్పా శెట్టి, సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్ నటించిన ‘ఫిర్ మిలేంగే’ సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. అదే సంవత్సరంలో, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఆనంద్’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకు ఆమె నంది అవార్డును కూడా గెలుచుకుంది, దీంతో ఆమెకు టాలీవుడ్‌లో మంచి స్థానం దక్కింది.
ఆ తర్వాత ఆమె ‘గోదావరి’, ‘క్లాస్‌మేట్’, ‘హ్యాపీ డేస్’, ‘జల్సా’ వంటి విజయవంతమైన సినిమాల్లో నాగార్జున, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలతో కలిసి నటించి పాన్ ఇండియా నటిగా ఎదిగింది. ఆమె మలయాళంలో మమ్ముట్టితో ‘కుట్టి శరంగు’ లో, తమిళంలో కమల్ హాసన్ నటించిన ‘వేట్టయాడు విళైయాడు’ (2006) లో నటించి తమిళ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు అయ్యింది.
కమలిని ముఖర్జీ 2016లో మోహన్‌లాల్‌తో కలిసి మలయాళంలో ‘పులి మురుగన్’ సినిమాలో, తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘ఇరైవి’ సినిమాలో నటించిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. దాదాపు 9 సంవత్సరాలకు పైగా ఆమె సినిమాల్లో కనిపించలేదు. అయితే, ఆమె తెలుగు సినిమాకు దూరమవడానికి గల కారణాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
రామ్ చరణ్‌తో కలిసి నటించిన తన చివరి తెలుగు చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’ గురించి ఆమె మాట్లాడుతూ… “ఆ సినిమాలో చిత్రబృందం నన్ను బాగానే చూసుకున్నారు. కానీ, సినిమా విడుదలయ్యాక నేను షాకయ్యాను. నా పాత్రను చిత్రించిన విధానం నాకు అస్సలు నచ్చలేదు. అది నాకు ఎంతో బాధ కలిగించింది. అందుకే తెలుగు సినిమాల్లో నటించడం మానేశాను” అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం కమలిని ముఖర్జీ అమెరికాలో స్థిరపడింది. సుమారు తొమ్మిది సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులను ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ఫోటోల్లో ఆమె లుక్ పూర్తిగా మారిపోయింది. ఆమెను చూసిన అభిమానులు, “ఈమె ‘వేట్టయాడు విళైయాడు’ లో నటించిన కమలిని ముఖర్జీనేనా?” అని ఆశ్చర్యంతో ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ ఫోటోలు 2023 కొత్త సంవత్సరం వేడుకల్లో ఆమె పాల్గొన్నప్పుడు తీసినవిగా తెలుస్తోంది. అయినప్పటికీ, వెండితెరపై చూసినప్పటికి, ఇప్పటికి ఆమె రూపంలో వచ్చిన మార్పు ఆమె అభిమానుల చర్చకు దారితీసింది.




