Kamal Haasan: కమల్ హాసన్ హెల్త్ పై క్లారిటీ ఇచ్చిన వైద్యులు.. ఏమన్నారంటే
అలాగే కమల్ కు శ్వాసతీసుకోవడంలో సమస్య తలెత్తిందని తెలుస్తోంది. చెన్నైలోని పోరూర్ రామచంద్ర ఆస్పత్రిలో నిన్న రాత్రి సమయంలో చేరారు కమల్ హాసన్.
స్టార్ హీరో కమల్ హాసన్ అనారోగ్యానికి గురయ్యారు.జ్వరం, దగ్గు, జలుబు, లక్షణాలతో కలం హాసన్ ఆసుపత్రిలో చేరారు. కమల్ అస్వస్థతకు గురైన విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కమల్ కు శ్వాసతీసుకోవడంలోనూ సమస్య తలెత్తిందని తెలుస్తోంది. చెన్నైలోని పోరూర్ రామచంద్ర ఆస్పత్రిలో నిన్న రాత్రి సమయంలో చేరారు కమల్ హాసన్. ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన పడుతున్న నేపథ్యంలో హెల్త్ బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. రామచంద్ర ఆస్పత్రి నటుడు కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులెటిన్ లో ఏమున్నదంటే..
కమల్ జ్వరం, దగ్గు, జలుబు, లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ లక్షణాలతో నిన్న రాత్రి ఆస్పత్రిలో చేరిన కమల్ హాసన్ కి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం అయన ఆరోగ్యం నిలకడగా ఉందని . రెండు రోజులలో కమల్ హాసన్ ని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. దాంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఇటీవలే విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు కమల్ హాసన్. చాలా రోజుల తర్వాత యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ హాసన్ సూపర్ హిట్ అందుకున్నారు.
ఇక ఇప్పుడు కమల్ హాసన్ ఇండియన్ 2లో నటిస్తున్నారు. గతంలో శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..