AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian 2 OTT: ఓటీటీలోకి కమల్ హాసన్ భారతీయుడు 2.. అనుకున్నదాని కంటే ముందే స్ట్రీమింగ్..

ఈమూవీపై ముందు నుంచి భారీ అంచనాలను నెలకొనగా.. జూలై 12న తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. అంతేకాదు.. నిడివి ఎక్కువగా ఉందని.. శంకర్ మార్క్ మిస్సైందంటూ విమర్శలు వచ్చాయి. దీంతో ఈమూవీ అంతగా కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టడం లేదు.

Indian 2 OTT: ఓటీటీలోకి కమల్ హాసన్ భారతీయుడు 2.. అనుకున్నదాని కంటే ముందే స్ట్రీమింగ్..
Indian 2 Movie
Rajitha Chanti
|

Updated on: Jul 24, 2024 | 8:41 AM

Share

విశ్వనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా భారతీయుడు 2. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 28 ఏళ్ల క్రితం సూపర్ హిట్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్. దీంతో ఈమూవీపై ముందు నుంచి భారీ అంచనాలను నెలకొనగా.. జూలై 12న తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. అంతేకాదు.. నిడివి ఎక్కువగా ఉందని.. శంకర్ మార్క్ మిస్సైందంటూ విమర్శలు వచ్చాయి. దీంతో ఈమూవీ అంతగా కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టడం లేదు. దీంతో ఈసినిమా అనుకున్నదాని కంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అటు ఈ మూవీ థియేట్రికల్ రన్ కూడా సరిగ్గా లేకపోవడంతో ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాను ఆగస్ట్ 2 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందనే టాక్ నెట్టింట వినిపిస్తుంది. రూ. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను గత ఆరేళ్ల క్రితమే స్టార్ట్ చేయగా.. అనుహ్య కారణాలతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఇక రెండేళ్లు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమాలో కమల్ హాసన్ యాక్టింగ్ అదరగొట్టినప్పటికీ శంకర్ మార్క్ మాత్రం మిస్సైందంటూ అసహనం వ్యక్తం చేశారు అడియన్స్. ఇప్పటివరకు ఇండియన్ 2 సినిమా కేవలం రూ.100 కోట్లు గ్రాస్ మాత్రమే రాబట్టినట్లు సమాచారం. తమిళంతోపాటు తెలుగు, హిందీలోనూ పెద్దగా వసూళ్లు రావడం.

28 ఏళ్ల క్రితం సూపర్ హిట్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా రూపొందించిన ఈచిత్రానికి మరో కొనసాగింపుగా భారతీయుడు 3 కూడా రూపొందించారు.ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇండియన్ 2 చిత్రానికి అటాచ్ చేయగా.. పార్ట్ 3పై మరింత అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలంటూ కోరుతున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్