AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan Health Update: కమల్ హాసన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారా.. ఆ ఫొటో ఇప్పటిదేనా..?

కరోనా నుంచి కోలుకోని కమల్ హాసన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారా.. అతను ఇంటికి వచ్చినట్లు వస్తున్న వార్తలు నిజమేనా.. కమల్ ఇంటికి చేరుకున్నట్లు ఒక ఫొటో సోషల్ మీడియాలో హల్‎చల్ చేస్తుంది....

Kamal Haasan Health Update: కమల్ హాసన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారా.. ఆ ఫొటో ఇప్పటిదేనా..?
Kamala Hasan
Srinivas Chekkilla
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 30, 2021 | 6:00 PM

Share

కరోనా నుంచి కోలుకోని కమల్ హాసన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారా.. అతను ఇంటికి వచ్చినట్లు వస్తున్న వార్తలు నిజమేనా.. కమల్ ఇంటికి చేరుకున్నట్లు ఒక ఫొటో సోషల్ మీడియాలో హల్‎చల్ చేస్తుంది. అయితే దీనిపై ఆయన పార్టీ మక్కల్ నీది మయ్యమ్ (MNM) వివరణ ఇచ్చింది. “కమల్ హాసన్ ఇంకా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాలేదని MNM ప్రతినిధి మురళీ అబ్బాస్ తెలిపారు. కమల్ బాగానే ఉన్నారని చెప్పారు. అతను పూర్తిగా కోలుకుని త్వరలో ఇంటికి తిరిగి వస్తాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

అయితే ఆ ఫొటో రెండేళ్ల క్రితం అపోలో హాస్పిటల్‌లో పాదాలకు శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చినప్పటి ఫొటో అని మురళీ అబ్బాస్ స్పష్టం చేశారు. కమల్ హాసన్ నాలుగు రోజుల క్రితం కరోనా వైరస్ పాజిటివ్ రావటంతో ఆస్పత్రిలో చేరారు. తన ఖాదీ బ్రాండ్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ లాంచ్ కోసం అమెరికా వెళ్లి వచ్చిన కమల్ హాసన్‎కు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

కమల్ హాసన్ ప్రస్తుతం చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. నవంబర్ 26, శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కమల్ ఆరోగ్యం స్థిరంగా ఉందని MNM వైస్ ప్రెసిడెంట్ AG మౌర్య తెలిపారు. “కమల్ హాసన్ ‘శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్’లో చేరారు. కరోనా నుంచి కోలుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు” అని మౌర్య చెప్పాడు.

ReadAlso.. Sirivennela Sitarama sastri Death: సిరివెన్నెల ఇకలేరు.. విషాదంలో టాలీవుడ్ ఇండస్ట్రీ..