Kamal Haasan: బిగ్ బాస్ సీజన్ 7కు కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్.? ఏకంగా భారీ రెమ్యూనరేషన్..!
విక్రమ్ సక్సెస్ కమల్ హాసన్‌ను పూర్తిగా మార్చేసింది. ఇన్నాళ్లు తన కెరీర్ ప్లానింగ్ విషయంలో ఫాలో అయిన రూల్స్‌ను పక్కన పెట్టి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు లోకనాయకుడు.
విక్రమ్ సక్సెస్ కమల్ హాసన్‌ను పూర్తిగా మార్చేసింది. ఇన్నాళ్లు తన కెరీర్ ప్లానింగ్ విషయంలో ఫాలో అయిన రూల్స్‌ను పక్కన పెట్టి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు లోకనాయకుడు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను పక్కన పెట్టేసి కొత్తగా కెరీర్ సెట్ చేసుకుంటున్నారు. విక్రమ్ సినిమాతో మరోసారి తన సత్తా ఎంటో ప్రూవ్ చేసుకున్నారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. ఈ సక్సెస్ కమల్ క్రేజ్‌ను డబుల్ చేయటంతో మరోసారి సినిమాల విషయంలో సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు లోకనాయకుడు. అదే సమయంలో స్మాల్ స్క్రీన్ విషయంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా రీ థింక్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా మోస్ట్ పాపులర్ అయిన బిగ్ బాస్ షో, ఇండియన్ లాంగ్వేజెస్‌లోనూ సూపర్ హిట్ అయ్యింది. ఈ షో తమిళ వర్షన్‌కు కమల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే 6 సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యాయి. అయితే కొద్ది రోజులుగా పాలిటిక్స్ మీద ఫోకస్ చేయాలనుకున్న కమల్ బిగ్ బాస్‌కు గుడ్ బై చెప్పేస్తారన్న టాక్ ఆ మధ్య తెగ వైరల్ అయ్యింది. పాలిటిక్స్‌తో పాటు సినిమాల్లోనూ బిజీగా ఉన్న కమల్… బిగ్ బాస్ నెక్ట్స్ సీజన్ హోస్ట్ చేయకపోవచ్చన్నది మేజర్‌గా వినిపించిన మాట. అంతేకాదు కమల్ ప్లేస్‌లో శింబును కూడా తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్స్‌కు చెక్ పెట్టే అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. విక్రమ్ సక్సెస్ తరువాత ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెంచిన కమల్, బిగ్ బాస్‌లోనూ కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్నేషనల్ లెవల్‌లో పాపులర్ అయిన షో కావటం.. తమిళ్‌లో కూడా మోస్ట్ సక్సెస్‌ఫుల్ అన్న పేరు రావటంతో నెక్ట్స్ సీజన్ హోస్ట్ చేసేందుకు కమల్ కూడా రెడీగానే ఉన్నారు. సో ఈ అప్‌డేట్‌తో తమిళ బిగ్ బాస్‌పై వినిపిస్తున్న రూమర్స్ కు చెక్ పడినట్టే అంటున్నారు టీవీ ఆడియన్స్.
(టీవీ9 ఎంటర్టైన్మెంట్ డెస్క్)




