Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’లో సీనియర్ నటి .. 18 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై శోభన.. లుక్ చూశారా?

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ ఫ్యూచరిస్టిక్‌ ఫిల్మ్‌ జానర్ లో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాలీ ఇలా సినిమా స్టార్లంతా ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు.

Kalki 2898 AD: ప్రభాస్ కల్కిలో సీనియర్ నటి .. 18 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై శోభన.. లుక్ చూశారా?
Kalki 2898 Ad Movie

Updated on: Jun 19, 2024 | 1:38 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ ఫ్యూచరిస్టిక్‌ ఫిల్మ్‌ జానర్ లో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాలీ ఇలా సినిమా స్టార్లంతా ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న కల్కి ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాలో ప్రభాస్ కారు బుజ్జి దేశంలోని ప్రధాన నగరాల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా కల్కి సినిమా నుంచి అభిమానులకు మరొక సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని మరియమ్‌ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ రోల్ లో ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభన నటిస్తుండడం విశేషం. తాజాగా ఆమె లుక్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ మరో 8 రోజుల్లో (కల్కి విడుదల తేదీ జూన్ 27) మరియమ్ మిమ్మల్ని కలుస్తారని పోస్ట్ లో తెలిపింది.

ప్రస్తుతం కల్కి సినిమాలో శోభన లుక్ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా 2006లో వచ్చిన మోహన్ బాబు, మంచు విష్ణుల సినిమాలో చివరి సారిగా నటించింది శోభన. ఆ తర్వాత కెమెరాకు దూరంగా ఉండిపోయింది. మళ్లీ ఇప్పుడు సుమారు 18 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది శోభన. దీంతో అభిమానులు సంతోషిస్తున్నారు. కాగా కల్కి సినిమాలో నాని, దుల్కర్‌ సల్మాన్, విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ అతిథి పాత్రల్లో కనిపించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మరో 8 రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరికొన్ని గంటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.