AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: అశ్వత్థామ తలదాచుకున్న గుడి ఇదే.. కల్కి‌లో చూపించిన ఈ ఆలయం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటులు నటించారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో అశ్వత్థామ  పాత్రలో నటించి మెప్పించారు. అలాగే కమల్ హాసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. దీపికా పదుకొనె ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. ఇక ఈ మూవీ తొలి రోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది.

Kalki 2898 AD: అశ్వత్థామ తలదాచుకున్న గుడి ఇదే.. కల్కి‌లో చూపించిన ఈ ఆలయం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది
Kalki 2898 Ad
Rajeev Rayala
|

Updated on: Jun 29, 2024 | 5:19 PM

Share

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా వైడ్‌గా ఇప్పుడు కల్కి ఫీవర్ కనిపిస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. బాహుబలి టాలీవుడ్ రేంజ్ ను పెంచేసిన ప్రభాస్ ఇప్పుడు మరోసారి కల్కి సినిమాతో తెలుగు సినిమాను మరో మెట్టు పైకెక్కించాడు మన డార్లింగ్. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటులు నటించారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో అశ్వత్థామ  పాత్రలో నటించి మెప్పించారు. అలాగే కమల్ హాసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. దీపికా పదుకొనె ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. ఇక ఈ మూవీ తొలి రోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. తొలి రోజు ఈ సినిమా రూ.191 కోట్లు రాబట్టింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహాభారత నేపథ్యంలో చూపించారు. ఇక ఈ సినిమాలో అమితాబ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. కాగా సినిమాలో అశ్వత్థామగా నటించిన అమితాబ్‌ బచ్చన్‌ ఓ గుడిలో తలదాచుకుంటాడు. ఆ గుడి ఎక్కడ ఉందో తెలుసా.. కల్కి సినిమాలో ఈ గుడి గురించి చూపించారు. కల్కి అవతారం పుట్టే సమయం వచ్చిన తర్వాత అశ్వత్థామ ఆ గుడి నుంచి బయటకు వస్తాడు. అయితే ఈ  గుడి నిజంగానే ఉంది.

అయితే ఈ గుడి నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వరస్వామి ఆలయమే.. దీనినే సినిమాలో చూపించారు. కాకా పోతే ఈ గుడిని కాశీలో ఉన్నట్టు చూపించారు. పెన్నానది తీరంలో ఈ గుడి బయట పడింది. 2020లో ఇసక తవ్వకాల్లో ఈ గుడి బయటపడింది. ఈ గుడిని పరశురాముడు నిర్మించారని ఇతిహాసాలు చెప్తున్నాయి. కాగా గతంలో వచ్చిన వరదల్లో ఈ గుడి ఇసుకలో మునిగిపోయింది. ఇక ఈ గుడి గురించి సినిమాలో చూపించిన తర్వాత ఎక్కువ పాపులర్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ గుడి గురించి రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే