Kajal Aggarwal: తన కొడుకు కాజల్ మొదట ఆ హీరో సినిమానే చూపిస్తుందట.. ఇంతకు ఆయన ఎవరంటే

లక్ష్మీకళ్యాణం సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కాజల్. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది ఈ భామ.

Kajal Aggarwal: తన కొడుకు కాజల్ మొదట ఆ హీరో సినిమానే చూపిస్తుందట.. ఇంతకు ఆయన ఎవరంటే
Kajal
Follow us

|

Updated on: Mar 10, 2023 | 7:26 AM

అందాల చందమామ కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. లక్ష్మీకళ్యాణం సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కాజల్. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది ఈ భామ. ఆ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాతో స్టార్ డమ్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది. డార్లింగ్‌, బృందావనం, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, బిజినెస్‌ మెన్‌, టెంపర్‌, ఖైదీ నంబర్‌ 150 తదితర ఎన్నో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సినిమాల్లో నటించి టాప్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ సొంతం చేసుకుంది.

హీరోయిన్‌గా బిజీ కెరీర్‌ కొనసాగుతున్న క్రమంలోనే 2020లో వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఏడడుగులు నడిచింది. తమ దాంపత్య బంధానికి గుర్తుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకి నీల్‌ కిచ్లూ అని నామకరణం కూడా చేసింది. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యంలో తేలియాడుతోన్న ఈ అందాల తార తన కుమారుడి ఫొటోలు ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటోంది.

తాజాగా కాజల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కొడుకునీల్‌కి ఎనిమిదేళ్లు వచ్చేవరకు సినిమాలకు దూరంగా ఉంచాలనినిర్ణయించుకున్నానని తెలిపింది. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవ్వకుండా పెంచాలని అనుకుంటున్నట్లు కాజల్‌ చెప్పుకొచ్చింది. అదేవిధంగా నీల్ చూసే తొలి సినిమా విజయ్‌తో తాను నటించిన ‘తుపాకీ’ సినిమా అని చెప్పింది కాజల్‌. ఎందుకు ఏంటి అనే విషయాన్నీ మాత్రం తెలుపలేదు. VijayVijay