Cinema OTT: ఓటీటీలోకి లీగల్ థ్రిల్లర్ మూవీ.. కోర్టు చుట్టూ తిరిగే సినిమాల.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు..
సాధారణంగా ఓటీటీ ప్రపంచంలో క్రైమ్ థ్రిల్లర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆడియన్స్‌ను కుర్చీ అంచున కూర్చోబెట్టే కథలతో దర్శకులు మెప్పిస్తున్నారు. ఇదే కోవలో బాలీవుడ్ క్వీన్ సోనాక్షి సిన్హా ,సౌత్ క్వీన్ జ్యోతిక కలిసి నటించిన ఓ లేటేస్ట్ మూవీ సైతం వస్తుంది. ఆ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. ? ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది ? అనే విషయాలు తెలుసుకుందామా.

ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ డ్రామాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. నిత్యం కొత్త కొత్త కంటెంట్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సినిమా సైతం ఓటీటీ సినీ ప్రియులను అలరించేందుకు రెడీ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, దక్షిణాది క్వీన్ జ్యోతిక ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ హై వోల్టేజ్ మూవీ సిస్టమ్. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సిరీస్ ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతోంది. సమాజంలో అవినీతి, వ్యవస్థలోని లోపాలు, వాటిని ఎదిరించే ఇద్దరు ధైర్యవంతులైన మహిళల చుట్టూ కథ తిరుగుతుంది. తన అద్భుతమైన నటనతో సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదరగొడుతున్న జ్యోతిక.. ఈ సిరీస్ లో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ‘దహాద్’ వంటి సిరీస్‌లతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనాక్షి, ఇందులో మరోసారి తన మార్క్ నటనను చూపించబోతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో చాలా స్పెషల్.. కలిసి నటించడం చాలా ఇష్టం.. నయనతార..
తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ మే 22 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. హారర్ , థ్రిల్లర్ ఎలిమెంట్స్ కలగలిసిన ఈ సిరీస్, కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ , మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్ ను దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వం వహించారు. బావేజా స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : 12 ఏళ్లుగా నా బ్రేక్ ఫాస్ట్ ఇదే.. అందుకే ఇలా ఉన్నాను.. డైట్ సీక్రెట్ చెప్పిన రవి బాబు..
ఈ సిస్టమ్ సినిమా కథాంశం మొత్తం న్యాయస్థానం చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా భిన్నమైన ప్రపంచాలకు చెందిన ఇద్దరు మొండి పట్టుదల గల మహిళల చుట్టూ జరిగే ఘర్షణను ఈ సినిమాలో చూపించనున్నారు. ఒకరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాగా, మరొకరు కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తుంటారు. వ్యవస్థలో ఉండే లోపాలు, అధికారం ఉన్నవారికే చట్టం చుట్టూ తిరిగే పరిస్థితుల మధ్య ఆ ఇద్దరు ఎలాంటి న్యాయం కోసం పోరాడారు అనేది సినిమా.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున..
