Cinema : 25 కోట్ల బడ్జెట్.. కేవలం 62 రాత్రులు షూటింగ్.. కట్ చేస్తే.. థియేటర్లు దద్దరిల్లిపోయాయ్..
2019లో విడుదలైన ఓ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసింది. ఒక ఆసక్తికరమైన కథకు పెద్ద ఆర్భాటం అవసరం లేదని ఆ సినిమా నిరూపించింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ చిత్రసీమలోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. అయితే మీకు తెలుసా.. ? ఈ చిత్రాన్ని పగటిపూట కాకుండా కేవలం రాత్రిపూట మాత్రమే చిత్రీకరించారు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రానికి IMDbలో 8కి పైగా రేటింగ్‌లు లభించాయి. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా ఏంటో తెలుసుకుందామా.

ప్రస్తుతం భారీ బడ్జెట్, స్టార్ హీరోహీరోయిన్లతో పాన్ ఇండియా లెవల్లో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇక మూవీ అనౌన్స్మెంట్ నుంచి మొదలు సినిమా విడుదలయ్యేంతవరకు ప్రతి చిన్న విషయం నెట్టింట తెగ అంచనాలు క్రియేట్ చేస్తుంది. కానీ ఒక చిన్న సినిమా.. అసలు ప్రచారం, ఆర్బాటాలు అనే విషయాలను పక్కన పెట్టింది. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం 62 రాత్రులు జరిగింది. ఆశ్చర్యకరంగా, ఈ చిత్రంలో హీరోయిన్ కూడా లేదు. కథానాయిక, పాటలు లేకపోయినా, ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుని, తన బడ్జెట్‌కు నాలుగు రెట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మనం మాట్లాడుకుంటున్న చిత్రం ‘ఖైదీ’. కోలీవుడ్ హీరో కార్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ తమిళ చిత్రం 2019లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ కథ ఒకే రాత్రి జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. అయితే షూటింగ్ మాత్రం దాదాపు 62 రాత్రులపాటు సాగింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున..
రాత్రి నిశ్శబ్దంలో, దట్టమైన అడవులలో, నిర్మానుష్యమైన రహదారులపై చిత్రీకరించిన ఈ చిత్రం, తెరపై అద్భుతమైన రిజల్ట్ చూపించింది. తన పాత్రకు జీవం పోయడానికి కార్తి చాలా కష్టపడ్డాడు. ‘ఖైదీ’ కేవలం రుూ.25 కోట్ల పరిమిత బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ లేదు, అలాగే ప్రేక్షకుల దృష్టి మరల్చడానికి పాటలు లేదా నృత్యాలు కూడా లేవు. అయినప్పటికీ ఈసినిమా చూసేందుకు అడియన్స్ క్యూ కట్టారు. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది.
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో చాలా స్పెషల్.. కలిసి నటించడం చాలా ఇష్టం.. నయనతార..
కథ విషయానికి వస్తే.. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించి జైలు నుంచి ఇప్పుడే విడుదలైన దిల్లీ (కార్తి) చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. తను ఇంతకు ముందెన్నడూ చూడని తన కూతురిని మొదటిసారి కలవడానికి అతడు ప్రయత్నిస్తాడు. కానీ విధి అతడిని, పోలీసులకు, డ్రగ్ మాఫియాకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న ఒక రాత్రికి తీసుకువెళుతుంది. ఒక పోలీస్ అధికారి భారీ పరిమాణంలో ఉన్న మాదకద్రవ్యాలను కాపాడటానికి ఢిల్లీ సహాయం కోరతాడు. మార్గమధ్యంలో ప్రమాదకరమైన నేరగాళ్లు వెంబడిస్తుండగా, ఢిల్లీ స్పృహ కోల్పోయిన డజన్ల కొద్దీ పోలీసులను ఒక ట్రక్కులో ఆసుపత్రికి తరలించాలి. తన కూతురిని తిరిగి కలుసుకోవాలనే తపన, అదే సమయంలో డజన్ల కొద్దీ పోలీసుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత – ఇదే ఈ చిత్రంలోని అసలైన ఉత్కంఠ. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : 12 ఏళ్లుగా నా బ్రేక్ ఫాస్ట్ ఇదే.. అందుకే ఇలా ఉన్నాను.. డైట్ సీక్రెట్ చెప్పిన రవి బాబు..
