AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరివర్తన యోగం..ఈ రాశుల వారికి అనూహ్య శుభాలు, అదృష్టం..!

Parivartana Yoga 2026: శుభగ్రహాలైన బుధ–శుక్రుల పరివర్తన యోగం మే 15 నుంచి 29 వరకు ప్రభావం చూపనుంది. దీని ప్రభావంతో మేషం, వృషభం, సింహం, కన్య, కుంభం, మీన రాశుల వారికి అనూహ్య శుభ పరిణామాలు, అదృష్ట మార్పులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.

పరివర్తన యోగం..ఈ రాశుల వారికి అనూహ్య శుభాలు, అదృష్టం..!
Parivartan Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 06, 2026 | 5:24 PM

Share

జ్యోతిషశాస్త్రంలో పరివర్తన యోగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. అందులోనూ శుభ గ్రహాల మధ్య పరివర్తన జరగడం ఒక ఉత్తమ యోగంగా గుర్తింపు పొందింది. ఈ నెల(మే) 15 నుంచి 29 వరకు శుభ గ్రహాలైన బుధ, శుక్రుల మధ్య పరివర్తన జరుగుతోంది. బుధుడికి చెందిన మిథున రాశిలో శుక్రుడు, శుక్రుడికి చెందిన వృషభ రాశిలో బుధుడి సంచారం వల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడింది. ఈ రెండు శుభ గ్రహాల మధ్య పరివర్తన జరిగే శుభ ఫలితాలకు కొదవే ఉండదు. దీని వల్ల మేషం, వృషభం, సింహం, కన్య, కుంభం, మీన రాశుల వారి జీవితాల్లో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

  1. మేషం: ఈ రాశికి తృతీయాధిపతి అయిన బుధుడికి, ధన స్థానాధిపతి అయిన శుక్రుడికి మధ్య పరివర్తన జరగడం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అందలాలు ఎక్కుతారు. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి.
  2. వృషభం: రాశ్యధిపతి శుక్రుడికి, ధన స్థానాధిపతి బుధుడికి పరివర్తన జరగడం వల్ల ప్రధానంగా ఆర్థిక పరి స్థితి అంచనాల్ని మించి మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు పూర్తిగా తగ్గిపోతాయి. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా ప్రాభవం పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి.
  3. సింహం: ఈ రాశికి దశమ, లాభ స్థానాల అధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఉద్యోగంలో పదోన్నతి లభించడంతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ వృద్ధి చెందుతుంది. ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన సమస్యలు, వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
  4. కన్య: రాశ్యధిపతి బుధుడు భాగ్యాధిపతి శుక్రుడితో పరివర్తన చెందడం వల్ల ఉద్యోగపరంగా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి, లాభాల పంట పండుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశంఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. కుంభం: ఈ రాశికి చతుర్థ, పంచమాధిపతులైన శుక్ర, బుధుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఇంటా బయటా సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఆస్తి వివా దాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. గౌరవమర్యాదలు, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
  7. మీనం: ఈ రాశికి తృతీయ, చతుర్ధాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఆర్థికంగా ఉన్నత స్థితి లభిస్తుంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us