సమ్మర్ స్పెషల్ మామిడి లస్సీ.. ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఇలా చేయండి!

06 May 2026

Rajashekher

మార్కెట్లో అమ్మే మామిడి లస్సీ చాలా చిక్కగా, క్రిమీగా, రుచికరంగా ఉంటుంది. అది అందరికీ నచ్చుతుంది. 

మీరు తీపిగా, రుచికరంగా ఏదైనా తినాలనుకుంటే.. మామిడి లస్సీని ఇంట్లోనే క్షణాల్లో తయారు చేసుకోవచ్చు.

మామిడి పండ్లను కడిగి, తొక్క తీసి, చిన్న ముక్కలుగా కోసి.. ఆ తర్వాత బ్లెండర్‌లో వేయండి. 

ఈ బ్లెండర్‌లో పెరుగు, పంచదార, యాలకుల పొడి, ఐస్ క్యూబ్ వేసి చిక్కబడే వరకు బ్లెండ్ చేయండి. 

ఇప్పుడు ఈ లస్సీని ఒక గ్లాసులోకి తీసుకోండి. అలాగే, మీకు కావాలంటే.. తరిగిన డ్రైఫ్రూట్స్‌ను కూడా పైన వేసి లస్సీలో కలుపుకోవచ్చు. 

లస్సీ చిక్కగా కావాలంటే.. నీళ్లు తక్కువగా వాడి, రుచికి సరిపడ షుగర్  కలపండి. షుగర్ బదులు తేనె కూడా వాడొచ్చు.

లస్సీని మరింత రుచికరంగా చేయడానికి మీరు కుంకుమ పువ్వు లేదా గులాబీ నీటిని జోడించవచ్చు. 

మామిడి బాగా పండినది అయితేనే రుచి బాగుంటుంది. ఎక్కువ క్రీమీ కావాలంటే పెరుగు ఎక్కువగా వాడండి.