AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara: జపాన్‌లో దేవర సందడి.. ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్‌లో దుమ్మురేపిన సినిమా

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి, ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనలో ఎన్టీఆర్ ను బీట్ చేసే వారు లేరు. ఎలాంటి పాత్ర అయినా యిట్టె ఒదిగిపోయి నటిస్తారు తారక్. అలాగే ఎన్టీఆర్ డాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండియాలో ఉన్న బెస్ట్ డాన్సర్స్ లో తారక్ ఒకరు. ఇటీవలే ఎన్టీఆర్ దేవర సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు.

Devara: జపాన్‌లో దేవర సందడి.. ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్‌లో దుమ్మురేపిన సినిమా
Devara
Rajeev Rayala
|

Updated on: Mar 19, 2025 | 7:34 AM

Share

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి సంచలన విజయం తర్వాత దేవర సినిమాతో హిట్ కొట్టాడు తారక్. ఈ సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. మాములుగా రాజమౌళి సినిమా తర్వాత ఆ హీరో చేసే సినిమాలు ఫ్లాప్ అవుతాయని టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ ఉంది. దాన్ని తారక్ బ్రేక్ చేశాడు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ లుక్, డైలాగ్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి.

ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దేవర సినిమాను త్వరలోనే జపాన్ లో విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ కు జపాన్ లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్ లోనూ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. జపాన్ లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కూడా చేశారు ఎన్టీఆర్. అక్కడ తారక్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. కాగా ఇప్పుడు దేవర సినిమాను కూడా జపాన్ లో విడుదల చేయనున్నారు.

కాగా దేవర సినిమా జపాన్ లో మార్చి 28, 2025న విడుదల కానుంది. ఎన్టీఆర్ మార్చి 22, 2025న జపాన్ వెళ్తున్నారు అక్కడ సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో కూడా పాల్గొంటారని సమాచారం. కాగా రీసెంట్ గా జపాన్‌లో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ స్క్రీనింగ్ జరిగింది. జపాన్‌లో జరిగిన ప్రత్యేక ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్‌లో దేవరాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దాంతో తారక్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన  ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.