AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాచ్ ధరతో ఒక లైఫ్ సెట్ అయిపోతుంది గురూ.. దాని కాస్ట్ ఎంతో తెలుసా..

అదేదో సినిమాలో చేతి వాచ్ అమ్మితే జీవితం సెటిలైపోతుంది అన్నట్టు సెలబ్రెటీలు వాడే వాచ్ కూడా అదే రేంజ్ లు కాస్ట్లీగా ఉంటాయి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాచ్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తారక్ చేతి వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా తారక్ నందమూరి సుహాసిని కొడుకు హర్ష పెళ్ళికి హాజరయ్యారు. ఈ వేడుకలో తారక్ హైలైట్ అయ్యారు. ఆయన డ్రసింగ్ అభిమానులను ఆకట్టుకుంది. పెళ్లిలో తారక్ చేసిన సందడి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాచ్ ధరతో ఒక లైఫ్ సెట్ అయిపోతుంది గురూ.. దాని కాస్ట్ ఎంతో తెలుసా..
Ntr
Rajeev Rayala
|

Updated on: Aug 24, 2023 | 1:42 PM

Share

మాములుగా సెలబ్రెటీలు కాస్ట్లీ దుస్తులు, వస్తులు వాడుతూ ఉంటారు. కాస్ట్లీ కారులు, బంగ్లాలు, బైక్ లు వాడుతూ ఉంటారు సెలబ్రెటీలు. అంతే కాదు వారి షూస్ కూడా అదిరిపోయే రేట్స్ ఉంటాయి. అదేదో సినిమాలో చేతి వాచ్ అమ్మితే జీవితం సెటిలైపోతుంది అన్నట్టు సెలబ్రెటీలు వాడే వాచ్ కూడా అదే రేంజ్ లు కాస్ట్లీగా ఉంటాయి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాచ్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తారక్ చేతి వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా తారక్ నందమూరి సుహాసిని కొడుకు హర్ష పెళ్ళికి హాజరయ్యారు. ఈ వేడుకలో తారక్ హైలైట్ అయ్యారు. ఆయన డ్రసింగ్ అభిమానులను ఆకట్టుకుంది. పెళ్లిలో తారక్ చేసిన సందడి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఆయన చేతి వాచ్ అందరిని ఆకర్షించింది.

తారక్ చేతికి ఉన్న వాచ్ ధర తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. తారక్ చేతి వాచ్ ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే. ఆయన వాచ్ అక్షరాలా రూ 2 కోట్ల 45 లక్షల రూపాయలు. తారక్ కు వాచ్ లంటే చాలా ఇష్టం ఇదే విషయాన్నీ ఆయన ఓ ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. రకరకాల వాచ్ లను ధరించడానికి తారక్ ఇష్టపడుతుంటారు. వాచ్ లతో పాటు సన్ గ్లాస్స్ , కార్స్ అంటే పిచ్చి అని తెలిపారు ఎన్టీఆర్.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ లగ్జరీ వాచ్ తో అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశారు. తారక్ వాచ్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు తారక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..