Jr NTR: ఏం కష్టమొచ్చిందయ్యా? చిన్న వయసులోనే కన్నుమూసిన జూనియర్‌ ఎన్టీఆర్‌ వీరాభిమాని.. విషాదంలో ఫ్యాన్స్‌

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయిన అతనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే తారక్‌కు డై హార్డ్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఎన్టీఆర్‌ కోసం ఏమైనా చేసే అభిమానులు బోలెడు మంది ఉన్నారు. అలా తారక్‌కు ప్రాణమిచ్చే వీరాభిమానుల్లో ఒకరు కన్నుమూశాడు.

Jr NTR: ఏం కష్టమొచ్చిందయ్యా? చిన్న వయసులోనే కన్నుమూసిన జూనియర్‌ ఎన్టీఆర్‌ వీరాభిమాని.. విషాదంలో ఫ్యాన్స్‌
Jr Ntr Fan

Updated on: Jun 25, 2023 | 8:08 PM

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయిన అతనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే తారక్‌కు డై హార్డ్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఎన్టీఆర్‌ కోసం ఏమైనా చేసే అభిమానులు బోలెడు మంది ఉన్నారు. అలా తారక్‌కు ప్రాణమిచ్చే వీరాభిమానుల్లో ఒకరు కన్నుమూశాడు. చిన్న వయసులోనే అతను చనిపోవడంతో తారక్‌ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. శ్యామ్‌ అనే కుర్రాడికి చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్‌ అంటే అమితమైన అభిమానం. ఎక్కడ తారక్‌ ఈవెంట్‌ జరిగినా ప్రత్యక్షమయ్యేవాడు. అంతేకాదు ఈవెంట్‌ పనులన్నీ కూడా దగ్గరుండి చూసుకునేవాడు. కొన్ని నెలల క్రితం యంగ్ హీరో విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ ఫంక్షన్‌కు కూడా వచ్చాడు శ్యామ్‌. ఎన్టీఆర్‌ వేదికపై ఉండగానే తన అభిమాన హీరోను గట్టిగా హత్తుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో తెగ వైరలయ్యింది.

ఈ క్రమంలో ఎన్టీఆర్‌ అంటే ప్రాణమిచ్చే శ్యామ్ చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. అతనెలా చనిపోయాడో తెలియదు కానీ అభిమానులు మాత్రం శోకసంద్రంలో మునిగిపోయారు. శ్యామ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తూ అతనికి నివాళి అర్పిస్తున్నారు. శ్యామ్‌ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.