తారక్ సిక్స్ ప్యాక్ ఫోటో.. నెట్టింట వైరల్

సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నానీ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు సడన్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆయన ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ ఆరంభించి 25 ఏళ్లు కంప్లీట్ అయిన సందర్భంగా...

తారక్ సిక్స్ ప్యాక్ ఫోటో.. నెట్టింట వైరల్
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 18, 2020 | 11:40 PM

సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నానీ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు సడన్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆయన ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ ఆరంభించి 25 ఏళ్లు కంప్లీట్ అయిన సందర్భంగా గతంలో ప్రముఖుల ఫొటోషూట్‌లో తీసిన స్టిల్స్‌ను ఆదివారం షేర్‌ చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ సిక్స్‌ప్యాక్‌లో ఉన్న పాత చిత్రాన్ని ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. 2018లో ‘అరవింద సమేత’ సినిమా కోసం తారక్‌ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టారు. ఆ సమయంలో క్లిక్‌ మనిపించిన ఫొటో అది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్  అవుతుంది. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని కొమురం భీమ్‌ పాత్ర కోసం మరింత ఫిట్‌గా మారారు తారక్.

తారక్​తో పాటు రత్నానీ సినీ సెలబ్రిటీలు హృతిక్‌ రోషన్, అమితాబ్‌ బచ్చన్‌, ఆలియా భట్‌, జాన్‌ అబ్రహం, కరీనా కపూర్‌, సన్నీ లియోనీ, పరిణీతి చోప్రా‌ తదితరులతో ఫొటోషూట్‌లో భాగంగా తీసుకున్న ఫోటోల్ని పంచుకున్నారు. అవన్నీ కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. రత్నానీ భారత్‌లోనే అగ్ర ఫ్యాషన్‌ ఫొటో గ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.