Bigg Boss 4: కుమార్ సాయి ఎలిమినేటెడ్‌.. కమెడియన్ మూడో‌ కోరికకు నాగ్ అభయం

బిగ్‌బాస్ 4లో ఆరో వారం ఎలిమినేషన్ జరిగింది. ఈ వారం నామినేషన్లలో మొత్తం 9 మందిని ఎన్నిక కాగా.. ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగార్జున

Bigg Boss 4: కుమార్ సాయి ఎలిమినేటెడ్‌.. కమెడియన్ మూడో‌ కోరికకు నాగ్ అభయం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 19, 2020 | 7:11 AM

Kumar Sai Elimination: బిగ్‌బాస్ 4లో ఆరో వారం ఎలిమినేషన్ జరిగింది. ఈ వారం నామినేషన్లలో మొత్తం 9 మందిని ఎన్నిక కాగా.. ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగార్జున.. చివరికి మోనాల్ గజ్జర్, కుమార్ సాయిని బ్యాగేజ్ సర్దుకోమన్నారు. వారిద్దరిని కన్ఫెసన్ రూమ్‌లోకి రావాలని సూచించారు. దీంతో హౌజ్‌లో ఒక్కసారిగా సీరియస్ వాతావరణం కనిపించింది. కుమార్ సాయి కాస్త స్పోర్టివ్‌గానే తీసుకున్నప్పటికీ.. మోనాల్‌ మాత్రం కన్నీటి పర్యంతం అయ్యింది.

ఇక వీరిద్దరితో మాట్లాడిన నాగార్జున.. వారిలో ఒకరు స్టేజ్ మీదికి వస్తారని, ఒకరు కన్ఫెషన్ రూమ్‌లోనే ఉంటారని తెలిపారు. వెంటనే కుమార్ సాయిని స్టేజ్‌ మీదికి పిలిచి, ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఇక ఎలిమినేట్ అవ్వలేదని తెలియగానే మోనాల్ మొహంలో కాస్త నవ్వు కనిపించింది. కుమార్ సాయి యాక్టివ్‌గా హుషారుగా మోనాల్‌కి బాయ్ చెప్పి, నాగార్జున దగ్గరకు వెళ్లారు. అతడి ప్రయాణాన్ని నాగార్జున టీవీలో చూపించారు. ఇక కుమార్ సాయి మాట్లాడుతూ.. ‘‘హౌజ్‌లోకి వెళ్తున్నప్పుడు మూడు కోరికలతో వెళ్తున్నానని మీకు చెప్పాను సర్‌. ఒకటి నేను గెలవడానికి వచ్చానని, రెండోది నేను బయటికి వచ్చే సమయానికి వ్యాక్సిన్ వచ్చి ఉండాలని. కానీ అవి రెండు జరగలేదు. కానీ మూడోది మీకు కథ చెప్తానని చెప్పాను సర్. వినేందుకు మీరు ఛాన్స్ ఇవ్వండి సర్’’ అని కోరారు. దీనికి నాగార్జున ఓకే అని అభయం ఇచ్చారు. దాంతో కుమార్ సాయి ఆనందానికి అవధుల్లేవు.

Read More:

ములుగుజిల్లాలో ఎన్‌కౌంటర్.. రాత్రికి రాత్రే పోస్ట్‌మార్టమ్

టూరిస్టుల కోసం వాటర్ ట్యాక్సీ..