Devara- Jr NTR: ‘ఆ డైరెక్టర్‌తో పనిచేయాలని ఉంది’.. మనసులో మాట బయట పెట్టిన దేవర

|

Sep 18, 2024 | 11:02 AM

కాగా దర్శక ధీరుడు రాజమౌళితో ఎక్కువ సార్లు పనిచేసిన ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్. అలాగే యంగ్ టైగర్ నటనా ప్రతిభను ఏ దర్శకుడూ సరిగ్గా ఉపయోగించుకోలేదని జక్కన్న ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది పెద్ద దర్శకులు ఎన్టీఆర్‌తో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు

Devara- Jr NTR: ఆ డైరెక్టర్‌తో పనిచేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన దేవర
Jr Ntr, Devara
Follow us on

ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. జక్కన్న తెరకెక్కించిన ఈ సినిమాలో తారక్ ఎనర్జిటిక్ యాక్టింగ్, డ్యాన్స్, ఫైటింగ్స్ కు ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. కాగా దర్శక ధీరుడు రాజమౌళితో ఎక్కువ సార్లు పనిచేసిన ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్. అలాగే యంగ్ టైగర్ నటనా ప్రతిభను ఏ దర్శకుడూ సరిగ్గా ఉపయోగించుకోలేదని జక్కన్న ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది పెద్ద దర్శకులు ఎన్టీఆర్‌తో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఓ తమిళ దర్శకుడి సినిమాలో నటించాలనుకుంటున్నాడట. ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పాడు. ‘దేవర’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ తాజాగా చెన్నై వెళ్లాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘తమిళ సినిమా ఎప్పుడు చేస్తారు?’ అన్న ప్రశ్న జూనియర్ ఎన్టీఆర్ కు ఎదురైంది. దానికి జూనియర్ ఎన్టీఆర్ వెంటనే బదులిస్తూ, నేను వెట్రిమారన్‌కి వీరాభిమానిని, ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, దయచేసి నాతో ఓ తమిళ సినిమా చేయండి, కావాలంటే తెలుగులో డబ్ చేద్దాం. దయచేసి నాతో సినిమా చేయండి’ అని రిక్వెస్ట్ చేశాడు.

 

ఇవి కూడా చదవండి

కాగా జూనియర్ ఎన్టీఆర్ కి వెట్రిమారన్ సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే ఆయనతో కలిసి పనిచేయాలని తారక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు వెట్రిమారన్ కూడా ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపాడు. ‘అసురన్’ సినిమా పూర్తయిన తర్వాత జూ ఎన్టీఆర్‌తో కొత్త సినిమా కోసం చర్చలు జరిగాయి. అయితే ఇద్దరికీ డేట్స్‌ సమస్య కారణంగా సినిమా పట్టాలెక్కలేదు.ఇక వెట్రిమారన్ చాలా మంది నటీనటులకు ఇష్టమైన దర్శకుడు. ‘పొల్లాధవన్’, ‘ఆడుకులం’, ‘విసారణై’, ‘వడ చెన్నై’, ‘అసురన్’, ‘విడుదలై’ తదితర సినిమాలతో వెర్సటైల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు వెట్రిమారన్. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తోన్న’విడుదలై పార్ట్ 2′ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

దేవర ప్రమోషన్లలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్.. వీడియో

ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అనిరుధ్ స్వరాలు సమకూర్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.