Devara: బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ బీభత్సం.. వారం రోజుల్లో ఎంత వచ్చాయంటే..
ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు భారీ విజయాన్ని అందుకుంది. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రంపై విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకుంది.
ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు భారీ విజయాన్ని అందుకుంది. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రంపై విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకుంది. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా తొలిరోజే రూ.172 కోట్లుకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో తారక్ డ్యూయల్ రోల్ లో మరోసారి యాక్టింగ్ అదరగొట్టారు. ఇక ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ జాన్వీ కాగా.. భైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ మెప్పించాడు. ఈ సినిమాకు పాన్ ఇండియా లెవల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది.
దేవర విడుదలై అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది. వీక్ డేస్ లోనూ దేవరకు ఏమాత్రం క్రేజ్ తగ్గట్లేదు. విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.405 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దక్షిణాదితోపాటు నార్త్ లోనూ ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అదే జోరు కొనసాగితే మరికొన్ని రోజుల్లో రూ.500 కోట్ల మార్క్ చేరుకోనుంది. దేవర సినిమా ఓ విజువల్ వండర్ అని.. ఇక అనిరుధ్ అందించిన మ్యూజిక్ వేరెలెవల్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.
దేవర చిత్రాన్ని రెండు పార్టులుగా తీసుకువస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుండగా.. త్వరలోనే సెకండ్ పార్ట్ చిత్రీకరణ ప్రారంభించనున్నారు.. ఈ సినిమాతోపాటు అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ తారక్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.
He’s the Dark Cloud of FEAR looming over all rivals 🔥
See it. Feel it. Fear it in Cinemas now.#Devara #DevaraBlockbuster pic.twitter.com/v707pr9GGZ
— Devara (@DevaraMovie) October 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.