దిస్ ఈజ్ ఎన్టీఆర్…ఎంత మంచి పని చేశాడో..

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్..‌ తన ఇంట్లో, ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు ముందస్తుగా జీతాలు చెల్లించేశారు. కరోనా ప్రభావంతో లాక్​డౌన్ విధించడం వల్ల అందరూ ఇళ్లలోనే ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ క్ర‌మంలోనే సినిమా ఆఫీసులు సైతం మూత‌ప‌డ్డాయి. ఈ నేపథ్యంలో తన వద్ద పనిచేస్తున్న స్టాఫ్ ఎటువంటి ఇబ్బందుల ఎదుర్కొకుండా ముంద‌స్తుగా జీతాల్ని చెల్లించేశారట తారక్. అంతేకాకుండా ఏ విధ‌మైనా సాయం అవ‌స‌ర‌మైనా ముందుటాన‌ని భ‌రోసా ఇచ్చాడ‌ట‌. కరోనా కట్టడిపై పోరు కోసం ఎన్టీఆర్‌ ఇప్పటివరకు […]

  • Ram Naramaneni
  • Publish Date - 10:35 pm, Fri, 8 May 20
దిస్ ఈజ్ ఎన్టీఆర్...ఎంత మంచి పని చేశాడో..

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్..‌ తన ఇంట్లో, ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు ముందస్తుగా జీతాలు చెల్లించేశారు. కరోనా ప్రభావంతో లాక్​డౌన్ విధించడం వల్ల అందరూ ఇళ్లలోనే ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ క్ర‌మంలోనే సినిమా ఆఫీసులు సైతం మూత‌ప‌డ్డాయి. ఈ నేపథ్యంలో తన వద్ద పనిచేస్తున్న స్టాఫ్ ఎటువంటి ఇబ్బందుల ఎదుర్కొకుండా ముంద‌స్తుగా జీతాల్ని చెల్లించేశారట తారక్. అంతేకాకుండా ఏ విధ‌మైనా సాయం అవ‌స‌ర‌మైనా ముందుటాన‌ని భ‌రోసా ఇచ్చాడ‌ట‌.

కరోనా కట్టడిపై పోరు కోసం ఎన్టీఆర్‌ ఇప్పటివరకు రూ.75 లక్షలు డొనేష‌న్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు, సినీ కార్మికుల కోసం రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే ఎన్టీఆర్..‌ లాక్‌డౌన్‌ వల్ల తన ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఆయ‌న‌‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటారు.