స‌రోజిని నాయుడు బ‌యోపిక్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్..లీడ్ రోల్ లో…

స‌రోజిని నాయుడు బ‌యోపిక్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్..లీడ్ రోల్ లో...

టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్..ఇలా ఇప్పుడు అన్ని ఇండ‌స్ట్రీల‌లో బ‌యోపిక్‌ల సీజ‌న్ కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ప్ర‌ముఖ స్వాతంత్య్ర‌ స‌మ‌రయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియా స‌రోజిని నాయుడు జీవిత క‌థ ఆధారంగా బ‌యోపిక్ తెర‌కెక్క‌బోతుంది. ఇందులో స‌రోజ‌ని దేవిగా రామానంద్ సాగ‌ర్ నిర్మించిన రామాయ‌ణ్‌లో సీత పాత్ర పోషించిన దీపికా చిఖలియా న‌టిస్తుంది. తాజాగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌గా, ఇందులో దీపికా ఏదో ఆలోచిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. ఓ స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధురాలిపై పెద్ద‌ చిత్రం రూపొంద‌నుండ‌డం ఇదే మొద‌టిసారి. […]

Ram Naramaneni

|

May 08, 2020 | 10:17 PM

టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్..ఇలా ఇప్పుడు అన్ని ఇండ‌స్ట్రీల‌లో బ‌యోపిక్‌ల సీజ‌న్ కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ప్ర‌ముఖ స్వాతంత్య్ర‌ స‌మ‌రయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియా స‌రోజిని నాయుడు జీవిత క‌థ ఆధారంగా బ‌యోపిక్ తెర‌కెక్క‌బోతుంది. ఇందులో స‌రోజ‌ని దేవిగా రామానంద్ సాగ‌ర్ నిర్మించిన రామాయ‌ణ్‌లో సీత పాత్ర పోషించిన దీపికా చిఖలియా న‌టిస్తుంది. తాజాగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌గా, ఇందులో దీపికా ఏదో ఆలోచిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తుంది.

ఓ స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధురాలిపై పెద్ద‌ చిత్రం రూపొంద‌నుండ‌డం ఇదే మొద‌టిసారి. ఆకాష్‌ నాయక్, ధీరజ్‌ మిశ్రా ద్వయం ‘స‌రోజిని’ అనే టైటిత్‌తో తెర‌కెక్కుతున్న‌ఈ బయోపిక్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని రాయల్‌ ఫిల్మ్‌ మీడియా సమర్పణలో కాను భాయ్‌ పటేల్‌ నిర్మించనున్నారు. అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రానికి సంబంధించి రిలీజైన‌ ఫ‌స్ట్ లుక్ ప్ర‌తి ఒక్కరిని ఆక‌ట్టుకుంటుంది.

View this post on Instagram

#sarojini#sarojininaudu …..1st look #poster……#starplus #ramayan #730 #everyday

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu