
Nandamuri Hari krishna Birth Anniversary: నందమూరి తారక రామారావు వారసుడు, ప్రముఖ నటుడు హరికృష్ణ జయంతి నేడు (సెప్టెంబర్ 2) . ఈ సందర్భంగా నందమూరి అభిమానులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. నటుడిగా, రాజకీయ నేతగా ఆయన అందించిన సేవలను స్మరించుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయనను స్మరించుకుంటూ ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ‘నాన్నా.. మీ 67వ జయంతి రోజున మిమ్మల్ని స్మరించుకుంటున్నాం.. ఈ అస్థిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తల్చుకునే అశ్రుకణం మీరే’ ఇట్లు మీ నందమూరి కల్యాణ్ రామ్, నందమూరి తారకరామారావు’ అంటూ తన తండ్రిపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నందమూరి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు హరికృష్ణకు నివాళులు అర్పిస్తున్నారు. ఇక నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు హరికృష్ణ. శ్రీకృష్ణావతరం, తల్లా? పెళ్లామా? తదితర సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన హరికృష్ణ దానవీరశూరకర్ణ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక శుభలేఖలు, సీతారామరాజు, శ్రీరాములయ్య, లాహిరి లాహిరి లాహిరిలో, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి, శ్రావణ మాసం సినిమాల్లో నటుడిగా మెప్పించారు. రాజ్యసభ ఎంపీగానూ సేవలందించిన హరికృష్ణ 2018 ఆగస్టు 29న కన్నుమూశారు. నల్గొండ జిల్లా నార్కేట్‌పల్లి దగ్గర జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆయన మృతిచెందారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ దేవరపై అంచనాలను పెంచేశాయి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీ 67వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ… pic.twitter.com/MwPWPJ8VMD
— Jr NTR (@tarak9999) September 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.