Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ వెనకే ఆ ముగ్గురు టాలీవుడ్ నిర్మాతలు.. ఎవరికి ఓటేస్తుందో మరి.?

సౌత్‌తో పాటు నార్త్ ఇండస్ట్రీని సైతం ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతోందంటూ చాలా రోజుల నుంచి..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ వెనకే ఆ ముగ్గురు టాలీవుడ్ నిర్మాతలు.. ఎవరికి ఓటేస్తుందో మరి.?
Jahnvi Kapoor
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 12, 2021 | 8:01 AM

సౌత్‌తో పాటు నార్త్ ఇండస్ట్రీని సైతం ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతోందంటూ చాలా రోజుల నుంచి నెట్టింట్లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సౌత్ వైపు జాన్వీ ఫోకస్ పెట్టినా.. సరైన సబ్జెక్ట్ రాకపోవడంతో.. ఆమె అరంగేట్రం ఆలస్యమవుతోందని టాక్ కూడా నడుస్తోంది. మరోవైపు పలువురు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి సైతం జాన్వీ కపూర్‌ను టాలీవుడ్ వైపు అడుగులు వేయించాలని చూసినా.. ఇప్పటిదాకా వర్కౌట్ కాలేదు.

అయితే తాజాగా సమాచారం ప్రకారం హారిక అండ్ హాసిని క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ లాంటి బడా బ్యానర్లు అతిలోక సుందరి తనయను లాంచ్ చేయడానికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అంతకముందు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అశ్వినీదత్ ”జగదేకవీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్‌తో జాన్వీ కపూర్‌ను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు.

ఇదిలా ఉంటే తాజాగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం విదితమే. ఈ మూవీలో జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయాలని చూస్తున్నారట. అలాగే దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్-శంకర్ కంబోలో తెరకెక్కుతున్న సినిమాలోనూ జాన్వీని తీసుకోవాలని ప్రయత్నాలు సాగుతున్నాయని టాక్. వీరితో పాటు ఈ ఏడాది లాంచ్ చేయనున్న పెద్ద ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్‌ను నటింపజేయాలని మైత్రీ మూవీ మేకర్స్ సంప్రదింపులు జరుపుతోందట. ఈ మూడింటిలో మహేష్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించనున్న చిత్రానికి జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మరో రూమర్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.!

కాగా, బాలీవుడ్‌లోకి ‘ధడక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. ‘అంగ్రేజీ మీడియం’, ‘గుంజన్ సక్సేనా’, ‘రూహి’ వంటి చిత్రాలతో మంచి పేరును సంపాదించుకుంది. ఈమె ప్రస్తుతం ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘దోస్తానా 2’, ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రాల్లో నటిస్తోంది.

Also Read:

ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!

అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే