AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscars 2026: విడుదలకు ముందే జాన్వీ సినిమా సంచలనం.. ఆస్కార్ అవార్డుకు అధికారిక ఎంట్రీ.. ఇంతకీ ఏముందీ మూవీలో..

జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే అందరి నోళ్లల్లో నానుతోంది. కేన్స్ ఫిల్మ్స్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. పలు విభాగాల్లో ఈ మూవీకి అవార్డులు కూడా వచ్చాయి.

Oscars 2026: విడుదలకు ముందే జాన్వీ సినిమా సంచలనం.. ఆస్కార్ అవార్డుకు అధికారిక ఎంట్రీ.. ఇంతకీ ఏముందీ మూవీలో..
Janhvi Kapoor Homebound Movie
Basha Shek
|

Updated on: Sep 19, 2025 | 8:36 PM

Share

జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న తాజా చిత్రం హోమ్‌ బౌండ్‌ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడీ హౌమ్ బౌండ్ సినిమా మరో అరుదైన ఘనత దక్కించుకుంది. 2026 ఆస్కార్ అకాడమీ అవార్డులకు ఇండియా నుంచి హౌమ్ బౌండ్ మూవీ అఫీషియల్‌గా ఎంట్రీ సాధించింది. ఈ హిందీ సినిమాను దీనిని నీరజ్ ఘైవాన్ డైరెక్ట్ చేశారు.. ఈ సినిమాలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెథ్వా ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 సెప్టెంబర్ 19న ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) దీనిని 2026 ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీ ఇచ్చింది. కరణ్ జోహార్, ఆదర్ పూనావాల్లా నిర్మించిన ఈ సినిమాకు హాలీవుడ్ దిగ్గజం మార్టిన్ స్కార్సెస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. సినిమా కథ గ్రామీణ భారతదేశంలోని సామాజిక సమస్యలు, కులం, మతపరమైన వివక్షల చుట్టూ తిరుగుతుంది. సినిమా కథ ఇద్దరు గ్రామీణ యువకుల సామాజిక గౌరవం కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే పోరాటంపై జరుగుతుంది.. వాళ్ళ స్నేహితురాలిగా జాన్వీ కపూర్ కీలక పాత్రలో నటించింది. శ్రీధర్ దుబేయ్, నీరజ్ ఘైవాన్, వరుణ్ గ్రోవర్ రాసిన స్క్రిప్ట్ సామాజిక సమస్యలను స్పృశించేలా ఉంటుంది.. 2025 మే 21న 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘అన్ సర్టెయిన్ రిగార్డ్’ సెక్షన్‌లో ప్రీమియర్ జరిగింది.. అక్కడ దీనికి 9 నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ లభించింది.

హోమ్‌ బౌండ్ సినిమా సెప్టెంబర్ 26, 2025న థియేటర్లలో విడుదల కానుంది.. తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది.. ఈ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. 2025 టొరాంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఈ సినిమా ప్రదర్శించబడింది. ఆస్కార్ ఎంట్రీగా ఎంపిక కావడం ద్వారా హోమ్ ‌బౌండ్ భారతీయ సినిమాకు గౌరవాన్ని తెచ్చింది. ఇది ఆస్కార్ రేసులో ఎలాంటి స్థానం సాధిస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.