Jagapathi Babu: ఆ ఒక్క సీన్ నా కెరీర్ మార్చింది.. అప్పట్లో ఆ షాట్ సంచలనం.. జగపతి బాబు..
ప్రముఖ నటుడు జగపతి బాబు తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని పాత్రలను పోషించారు. ఇటీవల పెద్ది సినిమాలో అప్పలరాజు పాత్రతో మరోసారి నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో, ఆయన తన కెరీర్‌లోని మైలురాళ్లను, అలాగే ఓ సూపర్ హిట్ చిత్రంలోని రైల్వే ట్రాక్ పక్కన కూర్చుని స్మోక్ చేసే ఐకానిక్ షాట్ గురించి గుర్తుచేసుకున్నారు. ఈ షాట్ తనను తాను నిరూపించుకున్న సందర్భం అని ఆయన పేర్కొన్నారు.

నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ పాత్రలు పోషించారు. ఇటీవల పెద్ది చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన విస్తృతమైన సినీ ప్రయాణాన్ని, విభిన్న పాత్రలను, వాటి ప్రభావాలను పంచుకున్నారు. ఆయన మాటల్లో అంతఃపురం చిత్రం, ముఖ్యంగా రైల్వే ట్రాక్ పక్కన కూర్చుని స్మోక్ చేసే సన్నివేశం తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిందని తెలిపారు. ఆ సన్నివేశం తన పీక్ షాట్‌గా, గుర్తింపు పొందిన పాత్రగా నిలిచిందని, అప్పటి అనుభవం పెద్ది చిత్రంలోని అప్పల సూరి పాత్రకు ప్రేరణగా నిలిచిందని అన్నారు. పెద్దిలో రైల్వే ట్రాక్ పక్కన సన్నివేశం చూసినప్పుడు, అంతఃపురంలోని ఆ దృశ్యం గుర్తుకు వచ్చిందని, దానిని మించిపోయేలా నటించాలనుకున్నానని ఆయన వివరించారు. పెద్దిలో అప్పల సూరి పాత్ర తనకు అపారమైన సంతృప్తినిచ్చిందని జగపతి బాబు పేర్కొన్నారు. ఈ పాత్రను దర్శకుడు బుచ్చిబాబు క్లైమాక్స్ లో మళ్లీ తీసుకురావడం తన పాత్రకు ఒక సాలిడ్ స్ట్రెంత్ ఇచ్చిందని, అది ఒక నటుడికి దొరికే గొప్ప అవకాశమని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..
ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటించిన ఇంటర్వెల్ బ్లాక్ సీన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉందని, ప్రాస్థెటిక్స్, గడ్డం, మీసాలతో కూడిన మేకప్ వల్ల చరణ్‌కు ఎక్కడ పట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడ్డాడని, అయినా ఎక్స్ప్రెషన్‌తో అద్భుతంగా నటించాడని జగపతి బాబు చెప్పుకొచ్చారు. ఆ సీన్ విజయవంతం కావడానికి ఇద్దరి నటన సమపాళ్లలో ఉండాలని ఆయన తెలిపారు. ప్రస్తుత సినీ పరిశ్రమలో పాత్రల ఎంపిక, నటులకు లభించే అవకాశాలపై జగపతి బాబు తన ఆందోళనను వ్యక్తం చేశారు. ఇదివరకు ఎస్.వి. రంగారావు, గుమ్మడి, రావు గోపాల్ రావు, సూర్యకాంతం వంటి నటుల క్యారెక్టర్లు పండాలని దర్శకులు కథలు రాసేవారని, కానీ ఇప్పుడు హీరో డ్రివెన్ చిత్రాలు ఎక్కువగా ఉన్నందువల్ల ఇతర పాత్రలకు ప్రాధాన్యత తగ్గిందని ఆయన అన్నారు. తనకు కూడా అప్పల సూరి వంటి మంచి క్యారెక్టర్ రావడానికి ఎనిమిదేళ్లు పట్టిందని తెలిపారు. విలన్ పాత్రల నుండి అప్పల సూరి వంటి పాజిటివ్ పాత్రకు మారడం ఒక కొత్త అనుభవం అని ఆయన పేర్కొన్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న వెబ్ సిరీస్..
జగపతి బాబుకు ప్రేక్షకులు, పరిశ్రమ నుండి లభిస్తున్న ఆదరణపైనా చర్చ జరిగింది. ఇతరుల భాషల్లోని నటులను ఎంతగానో ప్రశంసించే తెలుగు ప్రేక్షకులు, తమ నటుల విషయంలో చులకన భావం లేదా “మనోడే కదా” అనే నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నారని ప్రశ్నించగా, జగపతి బాబు దానిని అంగీకరించారు. “ఇతను ఎట్టాగో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడు”, “మనోడే కదా” అనే రెండు కారణాలు తన పట్ల లైట్ తీసుకునేలా చేస్తున్నాయని జగపతి బాబు భావించారు. అయితే అప్పల సూరి పాత్రకు వచ్చిన గుర్తింపు ఈ ధోరణిని మార్చిందని ఆయన అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..
ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..
