ఆ హీరో తన పొలం అమ్మి నా అప్పు తీరుస్తా అన్నాడు.. జగపతి బాబు ఎమోషనల్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో జగపతి బాబు ఒకరు. ఫ్యామిలీ ఆడియన్స్ ల్లో జగపతిబాబుకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు విలన్ గా నటిస్తున్నారు. అలాగే విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు జగపతిబాబు.

ఆ హీరో తన పొలం అమ్మి నా అప్పు తీరుస్తా అన్నాడు.. జగపతి బాబు ఎమోషనల్ కామెంట్స్
Jagapathi Babu

Updated on: Jan 07, 2026 | 7:29 PM

స్టార్ హీరోగా రాణించిన హీరోల్లో జగపతిబాబు ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అలరించారు జగపతిబాబు.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో జగపతి బాబు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఒకానొక సమయంలో హీరోగా రాణించిన జగపతిబాబు ఇప్పుడు విలన్ గా మారారు. బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాతో విలన్ గా మారారు జగపతి బాబు. లెజెండ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అతని వల్ల రూ. 20 లక్షల నష్టం.. ఆ జబర్దస్త్ కమెడియన్ నిజస్వరూపం బయటపెట్టిన షేకింగ్ శేషు

జగపతిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకప్పుడు భారీ ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నానని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. అప్పులకు 60 శాతం వడ్డీలు కూడా చెల్లించిన రోజులు ఉన్నాయని, తన కుటుంబానికి ఈ కష్టాలు తెలియకుండా చూసుకోవడానికి తాను ఎంతో ప్రయత్నించానని తెలిపారు జగపతిబాబు. తన ఆర్థిక ఇబ్బందులను ఒంటరిగానే ఎదుర్కొన్నానని జగపతిబాబు తెలిపారు. ఒకానొక సమయంలో తాను కష్టపడి కట్టుకున్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఇల్లు అమ్మినప్పుడు తనకు ఎలాంటి బాధ కలగలేదని, వస్తువుల పట్ల ప్రేమను పెంచుకోవడం సరైంది కాదని జగపతిబాబు అన్నారు.

ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. రాజా సాబ్ సినిమాలో ఆ సీన్స్ కట్.. సెన్సార్ బోర్టు రివ్యూ

తన బ్యాడ్ ఫేజ్ లో ఉన్నప్పుడు నటుడు అర్జున్ తనకు అండగా నిలిచారని జగపతిబాబు ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. నా పొలం అమ్మి నీ అప్పు తీరుస్తాను అని అర్జున్ తనతో చెప్పిన మాటలను ఆయన పంచుకున్నారు. అలాగే జూనియర్ ఎన్.టి.ఆర్. వంటి వారు కూడా తనను చిన్నవాడిలా చూసుకుంటారని, తన పట్ల శ్రద్ధ తీసుకుంటారని జగపతిబాబు తెలిపారు. సినిమా పరిశ్రమలో కొందరు స్నేహితులు ప్రాణం ఉన్నంతవరకు తోడుగా ఉంటారని జగపతిబాబు అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

విలన్ రామిరెడ్డి క్యాన్సర్‌ వల్ల చనిపోలేదు.. సంచలన విషయం చెప్పిన నటుడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి