AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: ‘నా తల్లి తర్వాత తల్లి’.. ప్రియురాలిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ‘గల్లీ బాయ్ భాస్కర్’

పటాస్, జబర్దస్త్, అదిరింది, కామెడీ స్టార్స్ తదితర టీవీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గల్లీ బాయ్ భాస్కర్. తనదైన కామెడీ పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్ ను బాగానే నవ్విస్తున్నాడు. ఈ మధ్యన సినిమాల్లోనూ కనిపిస్తోన్న భాస్కర్ తాజాగా తన ప్రియురాలిని పరిచయం చేశాడు.

Jabardasth: 'నా తల్లి తర్వాత తల్లి'.. ప్రియురాలిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ 'గల్లీ బాయ్ భాస్కర్'
Jabardasth Fame Gully Boy Bhaskar
Basha Shek
|

Updated on: Sep 28, 2026 | 6:39 PM

Share

గల్లీ బాయ్ భాస్కర్.. టీవీ షోలు బాగా చూసేవారికి ఈ కమెడియన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా జబర్దస్త్ షో చూసే వారికి అయితే ఈ స్టాండప్ కమెడియన్ బాగా తెలుసు. ఒక్క జబర్దస్త్ లోనే కాదు పటాస్, అదిరింది, కామెడీ స్టార్స్, శ్రీదేవీ డ్రామా కంపెనీ.. ఇలా ఎన్నో టీవీ షోల్లో సందడి చేశాడు భాస్కర్. తన దైన పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ముఖ్యంగా సద్దాం, యాదమ్మ రాజుతో కలిసి భాస్కర్ చేసిన స్కిట్స్ కు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం టీవీషోల్లోనే కాదు అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తున్నాడు భాస్కర్. అలాగే బయట ఈవెంట్స్ కూడా చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. వీటి సంగతి పక్కన పెడితే తాజాగా తన ప్రియురాలిని పరిచయం చేశాడీ జబర్దస్త్ కమెడియన్. నిజం చెప్పాలంటే గత నాలుగేళ్లుగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు భాస్కర్. అయితే ఇప్పటివరకు ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పలేదు. తాజాగా తన ప్రేమ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడీ జబర్దస్త్ కమెడియన్. ఓ టీవీ షోలో భాగంగా తన గర్ల్ ఫ్రెండ్ ను వేదిక పైకి తీసుకువచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. దీంతో షో యాంకర్ తో పాటు అతిథులు కూడా ఈ లవ్ బర్డ్స్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా గల్లీ బాయ్ భాస్కర్ మాట్లాడుతూ. . ‘తను నా ప్రేయసి. పేరు మానస. 2022లోనే నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. అయితే ఈ విషయం నాకు కూడా తెలియదు. ఆమెనే ప్రపోజ్ చేసే వరకు కూడా ఈ విషయం నాకు తెలియదు. నిజంగా తాను బంగారం. 2024 లో నేను గృహప్రవేశం చేయాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసింది. ఆ సమయంలో చుట్టాలు అందరూ వస్తున్నారు చేతిలో డబ్బు లేదు. గృహప్రవేశం ఎలా చేయాలి అని మదన పడుతున్న సమయంలో నా టెన్షన్ ను మానస గమనించింది. ఫోన్ కట్ చేయగానే వెంటనే 2 లక్షలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. నా కష్టాన్ని అర్థం చేసుకున్న దేవత.. నా తల్లి తర్వాత తల్లి అంటూ’ తన ప్రేయసిపై ప్రశంసలు కురిపించాడు భాస్కర్. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, బుల్లితెర సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ లవ్ బర్డ్స్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అలాగే జోడీ చాలా బాగుందంటూ కంగ్రాట్స్ చెబుతున్నారు.

ప్రియురాలితో గల్లీ బాయ్ భాస్కర్..

View this post on Instagram

A post shared by bhaskar (@gully_boy_bhaskar)

కాగా ప్రస్తుతం టీవీ షోలు, ఈవెంట్స్ తో బిజీగా ఉన్నా భాస్కర్ కొన్ని నెలల క్రితమే కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. పూజాది కార్యక్రమాలతో గ్రాండ్ గా గృహప్రవేశం నిర్వహించాడు. ఇప్పుడు తన ప్రేమ విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడించాడు.

View this post on Instagram

A post shared by bhaskar (@gully_boy_bhaskar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us