AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక్కడ బతికున్న వారికే పిండాలు పెడతారు! ఈ గుడి సీక్రెట్ ఏంటో తెలుసా?

పితృపక్షం ప్రారంభం అయ్యింది. అయితే ఈ సమయంలో చాలా మంది పిండ ప్రధానం గురించే ముచ్చటిస్తుంటారు. ప్రతి ఒక్కరూ తమ పూర్వీకులకు పిండ ప్రధానం, శ్రాద్ధ కర్మలు చేస్తుంటారు. అయితే ఎవరికి అయినా సరే మరణించి తర్వాత వారిని గుర్తు చేసుకుంటూ పిండ ప్రధానం చేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా బతికి ఉన్నవారే పిండపెడతారు. ఇంతకీ అది ఎక్కడ? దీని గురించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Sep 28, 2026 | 4:54 PM

Share
చాలా మంది ప్రజలు తమ పూర్వీకులను గుర్తు చేసుకొని వారి ఆత్మకు శాంతి చేకూరాలని పిండ ప్రధానం చేస్తుంటారు. కానీ బీహార్‌లోని ఓ ఆలయంలో మాత్రం బతికి ఉన్నవారికి కూడా పిండం పెడతారు. ఈ ఆచారం గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతూ వస్తుందంట.  బిహార్‌లోని జనార్ధన్ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. రాష్ట్రంలోని గయ జిల్లాలో ఉన్న భస్మకూట పర్వతంపై ఉన్న ఈ ఆలయంలో ప్రజలు బతికి ఉండగానే శ్రాద్ధం చేస్తారంట.

1 / 5
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ విష్ణు మూర్తి జనార్ధని రూపంలో కొలువై ఉన్నారని, భక్తులు ఆయనను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఎప్పుడూ భక్తులతో ఈ ఆలయం నిండిపోతుంది. ముఖ్యంగా పితృపక్షంలో ఈ ఆలయం మరింత భక్తజనసంద్రంగా మారిపోతుందంట.

2 / 5
ఎందుకంటే? ఈ ఆలయంలో ఈ సమయంలో బతికి ఉన్న వ్యక్తికే పిండ ప్రదానం చేస్తారంట.  కొందరు తమకు తామే పిండ ప్రధానం కూడా ఇక్కడ చేసుకుంటారు. ఇలా బతికి ఉండగా, తమకు తామే పిండ ప్రధానం స్వయంగా చేసుకున్న వారు మరణానంతరం మోక్షాన్ని పొందుతాయని అక్కడి వారి నమ్మకం. ఇలా చేసిన తర్వాత ఒక వేళ వారి కుటుంబ సభ్యులు మరణానంతరం పిండప్రదానం కర్మకాండలు కూడా చేయాల్సిన అవసరం లేదనే ఒక మతపరమైన నమ్మకం ఉంది.

3 / 5
 అందుకే చాలా మంది ఈ సమయంలో జనార్ధన్ ఆలయానికి వచ్చి తమ బంధువులకు లేదా తమకు తామే పిండ ప్రదానం చేసుకుంటారంట. అయితే చాలా వరకు ఈ గుడిలో  సంతానం లేదా వారసులు లేనివారు, సన్యాసం తీసుకున్నవారు, వారు జీవించి ఉండగానే ఇక్కడ తమకు తామే పిండ ప్రదానం చేస్తారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయం అని అక్కడి వారు చెబుతుంటారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us