AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Madhav: వేణు మాధవ్ ప్రతి ఇంటికీ ఆ ఇద్దరి పేర్లే ఉంటాయి.. కారణం ఇదే..

దివంగత హాస్యనటుడు వేణు మాధవ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన కామెడీ డైలాగ్స్, నటనతో ప్రేక్షకులను నవ్వించి ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో చెరగని ముద్రవ వేసుకున్నారు. సెప్టెంబర్ 28న వేణు మాధవ్ జయంతి. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Venu Madhav: వేణు మాధవ్ ప్రతి ఇంటికీ ఆ ఇద్దరి పేర్లే ఉంటాయి.. కారణం ఇదే..
Venu Madhav
Rajitha Chanti
|

Updated on: Sep 28, 2026 | 4:36 PM

Share

టాలీవుడ్ దివంగత హాస్యనటుడు వేణు మాధవ్ జయంతి నేడు. ఈ సందర్భంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో ఆయన మాట్లాడుతూ రచ్చ సినిమా సెట్‌లో సొమ్మసిల్లి పడటం, బహుళ వివాహాలు, ఆర్థిక సమస్యలపై నిజాలను వెల్లడించారు. తనకున్న ఆస్తులు, వ్యవసాయ భూమి, అలాగే పరిశ్రమలో ఎదురైన అనుభవాలను పంచుకుంటూ, తన పునరాగమనంపై ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, రాత్రి డిన్నర్ తీసుకోకుండా వరుస షూటింగ్‌లలో పాల్గొనడం వల్ల ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయానని వివరించారు. ఈ ఒక్క సంఘటనను ఆధారంగా చేసుకుని తాను తాగి పడిపోయానని, ఆరోగ్యం బాగాలేదని అనేక రూమర్లు పుట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిట్స్ ఉన్నాయనే ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. జీన్స్ షోలో పడిపోయానని వస్తున్న వార్తలను కూడా ఆయన తోసిపుచ్చారు. బృందావనం సినిమా ప్రమోషన్ కోసం జీన్స్ షోకు వెళ్లానని, అక్కడ తాను పూర్తిగా షో చేశానని, ఎక్కడా పడిపోలేదని స్పష్టం చేశారు.

తనకు పది ఎకరాల వ్యవసాయ భూమి కరీంనగర్ జిల్లాలో ఉందని వేణుమాధవ్ తెలిపారు. అలాగే, నివాస గృహాల గురించి మాట్లాడుతూ, ఒక పెద్ద ఇల్లుతో పాటు మరో పది చిన్న ఇళ్లు ఉన్నాయని చెప్పారు. ఈ ఇళ్లకు అచ్చి వచ్చిన కృష్ణా నిలయం అనే పేరు ఉంటుందని, కృష్ణా రెడ్డి, అచ్చి రెడ్డి పేర్లతో కలిపి ఈ పేరు పెట్టారని వివరించారు. మౌలాలి హౌసింగ్ బోర్డ్ నుండి మంగాపురం కాలనీ వరకు పలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు తనకే ఉన్నాయని, వాటిని అద్దెకు ఇచ్చానని పేర్కొన్నారు. ఇటీవల తన పెద్ద ఇంటిని రంగులు వేయించడం కోసం తాత్కాలికంగా ఖాళీ చేశానని, త్వరలోనే తిరిగి అందులోకి మారుతానని చెప్పారు.

మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన వేణు మాధవ్.. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘సంప్రదాయం’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ (1998) , మాస్టర్ (1997) సినిమాలతో ఆయనకు నటుడిగా పెద్ద బ్రేక్ లభించింది.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. ఆమె నుదుటన సూది మొనంత ప్రేమ రాయలేదు ఆ దేవుడు..

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంది రా బాబూ పాట.. 2 రోజులుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో మోత మోగిపోద్ది..

Follow Us