AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : హీరోగా సంవత్సరానికి 18 సినిమాలు చేశా.. కానీ ఒక్క తప్పుతో కెరీర్ నాశనం.. ఇప్పుడు సహాయ నటుడిగా..

సీనియర్ నటుడు తన సినీ కెరీర్‌లో సంవత్సరానికి 18 సినిమాలు చేయడం, జాండీస్ బారిన పడటం వంటి కష్టాలను వెల్లడించారు. తన తండ్రి నిర్మాతగా ఎదుర్కొన్న ఆర్థిక నష్టాలు, తన జీవితంలో టెలివిజన్ రంగం అందించిన ఆదరువు, ప్రస్తుత ఆర్థిక శాంతి, సాధారణ జీవన తత్వాన్ని ఆయన వివరించారు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Tollywood : హీరోగా సంవత్సరానికి 18 సినిమాలు చేశా.. కానీ ఒక్క తప్పుతో కెరీర్ నాశనం.. ఇప్పుడు సహాయ నటుడిగా..
Suresh
Rajitha Chanti
|

Updated on: Sep 28, 2026 | 3:34 PM

Share

సీనియర్ నటుడు సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా, తర్వాత సహాయ నటుడిగా అలరించాడు. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ కెరీర్‌లోని ఎత్తుపల్లాలను, ఆర్థిక ప్రస్థానాన్ని, వ్యక్తిగత జీవిత తత్వాన్ని కుండబద్దలు కొట్టారు. గోల్డెన్ ఎరాగా అంటూ ఒక దశలో, సంవత్సరానికి 18 సినిమాలు చేసి రికార్డు సృష్టించానని ఆయన గుర్తు చేసుకున్నారు. పెళ్లయిన కొత్తలో మార్నింగ్, మధ్యాహ్నం, నైట్, మిడ్ నైట్ షిఫ్ట్‌లతో నిరంతరం పనిచేయడం వల్ల జాండీస్ బారిన పడి రెండు నెలలు తీవ్రంగా బాధపడినట్లు తెలిపారు. ఈ అనుభవం తర్వాతే తన కెరీర్‌ను పునరాలోచించుకున్నానని, కథ, పాత్రలను సరిగ్గా అర్థం చేసుకోకుండా అన్నీ ఒప్పుకోవడం సరికాదని గ్రహించానని పేర్కొన్నారు. అప్పటివరకు తన డేట్స్ చూసుకున్న తండ్రికి బదులుగా, తనే స్వయంగా డేట్స్ చూసుకోవడం ప్రారంభించానని, కేవలం మంచి కథలను, రాణించగల పాత్రలను మాత్రమే ఎంచుకోవడం మొదలుపెట్టానని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Roja: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయనతో చాలా సినిమాలు చేశా.. హీరోయిన్ రోజా..

ఆర్థికంగా స్థిరత్వం సాధించడం ఎంత ముఖ్యమో సురేష్ ఈ సందర్భంగా చెప్పారు. తన తండ్రి నిర్మాతగా 12-13 సినిమాలు, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా కలిపి మొత్తం 28 సినిమాలు నిర్మించి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు. సినిమాకు వచ్చిన లాభంతో మరికొంత అప్పుచేసి మరో సినిమాలో పెట్టడం ఆయన జీవితంలో రొటేషన్ అయిందని సురేష్ వివరించారు. చివరికి తన తండ్రి “నువ్వు మాత్రం నిర్మాత కావద్దురా” అని సలహా ఇచ్చారని, దురదృష్టవశాత్తు తాను నిర్మాతగా మారి డబ్బులు పోగొట్టుకున్నానని ఒప్పుకున్నారు. ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి తనను టీవీ అనే దేవత కాపాడిందని కృతజ్ఞతలు తెలిపారు. తన భార్య పేరు మీద 8-9 సీరియల్స్ నిర్మించి, టీవీ రంగంలో ఆర్థికంగా నిలదొక్కుకున్నానని సురేష్ వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: నిజమైన కథతో వచ్చిన 8 ఎపిసోడ్స్ సిరీస్.. 60 దేశాలలో నంబర్ వన్.. ఒక్కసారి చూస్తే అస్సలు వదలరు..

ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితిపై “పీస్ ఫుల్”గా ఉన్నానని సురేష్ తెలిపారు. మూడు పూటలా తిండి, కట్టుకునే గుడ్డ, పైన నీడ ఉంటే చాలని, దీని పైన ఏది వచ్చినా బోనస్సేనని తన జీవిత తత్వాన్ని స్పష్టం చేశారు. గతంలో తాను చెన్నైలో స్పోర్ట్స్ కార్ కొన్న మొదటి వ్యక్తిని అని, అప్పట్లో 16 లక్షలు అంటే సగం టి.నగర్ కొనేంత డబ్బని చెప్పారు. సడన్‌గా డబ్బులు రావడం వల్ల వాటిని ఎంజాయ్ చేయాలనే తపనతో ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగానని, ట్రావెలింగ్‌కే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టానని తెలిపారు. ఏదైనా సినిమా హిట్ అయితే, “మీరు ఇంద్రుడు సార్, మీరు చంద్రుడు సార్” అంటూ వచ్చే పొగడ్తలను (చక్క భజనలు) తప్పించుకోవడానికి యూరప్ అంతా బ్యాక్‌ప్యాక్ వేసుకొని తిరిగేవాడినని ఆయన సరదాగా చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. ఆమె నుదుటన సూది మొనంత ప్రేమ రాయలేదు ఆ దేవుడు..

సురేష్..

Suresh New

Suresh New

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంది రా బాబూ పాట.. 2 రోజులుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో మోత మోగిపోద్ది..

Follow Us