AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Tickets: పోస్టాఫీస్ ద్వారా కూడా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.. ఈ సింపుల్ పని చేస్తే చాలు.. ఎలానో చూడండి..

పోస్టాఫీసుల్లో ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చా..? అంటే.. అవుననే చెప్పవచ్చు. సాధారణ రిజర్వుడ్ టికెట్లు మాత్రమే కాదు.. తత్కాల్ టికెట్లు కూడా బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ఏయే పోస్టాఫీసుల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.. ? బుకింగ్ చేసుకోవడం? ఎలా అనే విషయాలు చూద్దాం.

Train Tickets: పోస్టాఫీస్ ద్వారా కూడా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.. ఈ సింపుల్ పని చేస్తే చాలు.. ఎలానో చూడండి..
Post Office
Venkatrao Lella
|

Updated on: Sep 28, 2026 | 3:11 PM

Share

పోస్టాఫీసులో ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సేవలు అందిస్తోంది. లెటర్స్, పార్సిళ్లు, మనీ ఆర్డర్ లాంటి సేవలతో పాటు సేవింగ్స్ అకౌంట్ తెరవడం, పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టడం, ఇన్సూరెన్స్ లాంటి అనేక సేవలు పొందే అవకాశముంది. ఇక డీమ్యాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే ట్రైన్ టికెట్లను కూడా బుక్ చేసుకునే సదుపాయం కూడా పోస్టాఫీసుల్లో ఉంది. అవును.. కానీ ఈ విషయం చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. రిజర్వుడ్ టికెట్లతో పాటు తత్కాల్ టికెట్లను కూడా పోస్టాఫీసుల ద్వారా బుక్ చేసుకునే ఫెలిసిటీ ఉంది. రైల్వేశాఖతో కలిసి పోస్టల్ శాఖ ఈ సేవలను అందిస్తోంది.

కేవలం ఈ పోస్టాఫీసుల్లోనే ట్రైన్ టికెట్ల బుకింగ్..

కానీ అన్ని పోస్టాఫీసుల్లో ట్రైన్ టికెట్ల బుకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లు, బుకింగ్ కౌంటర్లు అందుబాటులో ఉండవు. ఈ రైల్వే స్టేషన్ల పరిధిలోని పోస్టాఫీసుల్లో ట్రైన్ల టికెట్, తత్కాల్ టికెట్ బుకింగ్ సదుపాయం ఉంటుంది.  రైల్వే స్టేషన్ సమీపంలోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ సౌకర్యం ఉండదు. కేవలం ఒకటి, రెండు పోస్టాఫీసుల్లోనే ఈ ఫెసిలిటీ ఉంటుంది. దీంతో ఏ పోస్టాఫీసులో ట్రైన్ టికెట్ బుకింగ్ సౌకర్యం ఉందనేది ముందు తెలుసుకుని వెళ్లాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 333 పోస్టాఫీసుల్లో ట్రైన్ టికెట్, తత్కాల్ టికెట్ బుకింగ్ సదుపాయం అమల్లో ఉంది. రైల్వే స్టేషన్ రిజర్వేషన్ల కౌంటర్లలో ఉపయోగించే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌నే పోస్టాఫీసుల్లో కూడా ఉపయోగించి టికెట్లను బుక్ చేస్తారు.

పోస్టాఫీసుల్లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం ఎలా..?

ముందుగా మీ సమీపంలోని పోస్టాఫీసుల్లో రైల్వే టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయా.. లేదా అనేది తెలుసుకోవాలి. అందుబాటులో ఉంటే.. పోస్టాఫీస్‌కు వెళితే ట్రైన్ టికెట్ బుకింగ్‌ ఫారం అందిస్తారు. ఆ ఫారంలో ప్రయాణికుల వివరాలు రాసి సమర్పించాలి. ప్రయాణికుల పేర్లు, స్టార్టింగ్, డెస్టినేషన్, డేట్, రైలు పేరు లేదా నెంబర్, క్లాస్ వివరాలు రాసి ఇవ్వాలి. అనంతరం పేమెంట్ చేయాలి. దీంతో పోస్టల్ సిబ్బంది బుకింగ్ చేసి టికెట్ మీకు అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ట్రైన్ టికెట్లను సులువుగా బుకింగ్ చేసుకునేలా రైల్వేశాఖతో కలిసి పోస్టల్ శాఖ ఈ సేవలు ఎప్పటినుంచో అందిస్తుంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. సాధారణ టికెట్లు మాత్రమే కాకుండా తత్కాల్ టికెట్లను కూడా పోస్టాఫీస్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.

Follow Us
ఒక్కసారే పెట్టుబడి.. జీవితాంతం రూ.25,088 పెన్షన్..
ఒక్కసారే పెట్టుబడి.. జీవితాంతం రూ.25,088 పెన్షన్..
ఒక్క పతకం కొట్టకుండానే వెనుదిరిగిన స్టార్ షూటర్
ఒక్క పతకం కొట్టకుండానే వెనుదిరిగిన స్టార్ షూటర్
ఇది కదా కావాల్సింది.. టోల్ బూత్‌లకు గుడ్‌బై.. ఇక రయ్ రయ్ అంటూ..
ఇది కదా కావాల్సింది.. టోల్ బూత్‌లకు గుడ్‌బై.. ఇక రయ్ రయ్ అంటూ..
పోస్టాఫీస్ ద్వారా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవడం ఎలా..?
పోస్టాఫీస్ ద్వారా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవడం ఎలా..?
మైదానంలోనే పొట్టుపొట్టుగా తిట్టుకున్న ప్లేయర్లు..!
మైదానంలోనే పొట్టుపొట్టుగా తిట్టుకున్న ప్లేయర్లు..!
గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ప్రముఖ క్రికెటర్ బ్యాట్లు చోరీ
గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ప్రముఖ క్రికెటర్ బ్యాట్లు చోరీ
నవరాత్రుల్లో అరుదైన త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు జాక్ పాట్
నవరాత్రుల్లో అరుదైన త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు జాక్ పాట్
పిడుగులు, ఈదురుగాలుల ముప్పు.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందో
పిడుగులు, ఈదురుగాలుల ముప్పు.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందో
థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న మూవీ..
థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న మూవీ..
కోడి ముందా.. గుడ్డు ముందా? వెయ్యేళ్ల ప్రశ్నకు సైంటిస్టుల ఆన్సర్!
కోడి ముందా.. గుడ్డు ముందా? వెయ్యేళ్ల ప్రశ్నకు సైంటిస్టుల ఆన్సర్!