AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా కావాల్సింది.. టోల్ బూత్‌లకు గుడ్‌బై.. ఇక రయ్ రయ్ అంటూ నాన్‌స్టాప్ జర్నీ..

టోల్ ప్లాజా కనిపించగానే స్పీడ్ తగ్గించాల్సిందే. బూత్ దగ్గరకు వెళ్లగానే వాహనం ఆపాల్సిందే. ఫాస్టాగ్ ఉన్నా.. కొన్ని సందర్భాల్లో క్యూలో నిలబడాల్సిందే.. పండుగల సమయంలో అయితే అరగంటకు పైగా పడిగాపులు కాయాల్సిందే. కానీ ఇక ఆ సీన్ మారబోతోంది.. వాహనం ఆగాల్సిన అవసరం లేకుండా సెకన్లలో టోల్ చెల్లింపు పూర్తయ్యే రోజులు వస్తున్నాయి. నూతన టోల్ విధానమేంటో తెలుసుకుందాం..

ఇది కదా కావాల్సింది.. టోల్ బూత్‌లకు గుడ్‌బై.. ఇక రయ్ రయ్ అంటూ నాన్‌స్టాప్ జర్నీ..
Multi Lane Free Flow Tolling
M Revan Reddy
| Edited By: |

Updated on: Sep 28, 2026 | 3:15 PM

Share

జాతీయ రహదారులపై ప్రస్తుత ఫాస్టాగ్ విధానంలో కూడా వల్ల టోల్ బూత్‌ల వద్ద వాహనాలు ఆగి ముందుకు కదలాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. పండుగ సెలవు దినాల్లో సొంతూళ్లకు వెళ్లే వారితో రోడ్లపై వాహనాల రద్దీ ఉంటోంది. అలాంటి వేళల్లో టోల్ బూత్ల వద్ద వాహనదారులు వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. ఇక ఈ సమస్యకు చెక్ పెట్టడమే లక్ష్యంగా.. మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ విధానం తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా టోల్ వసూళ్లలో కొత్త అధ్యాయానికి కేంద్రం శ్రీకారం చుడుతుండగా.. తెలంగాణలోనూ ఈ సిస్టమ్ అమల్లోకి రాబోతోంది. రాష్ట్రంలోని 11 టోల్ ప్లాజాల్లో మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ విధానాన్ని ఏర్పాటు చేసేందుకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. మరో ఐదారు నెలల్లో కొత్త విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుత టోల్ విధానానికి స్వస్తి..

ఇక టోల్ ప్లాజా దగ్గర కనిపించేది సాంప్రదాయ బూత్ కాదు.. ప్రతి లేన్ గ్యాంట్రీలకు ఆర్ఎఫ్ఐడీ రీడర్లు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలు, సెన్సార్లు, రాడార్, లిడార్ తదితర పరికరాలు అమర్చుతారు. వాహనం గ్యాంట్రీ కింద నుంచి వెళ్లగానే.. దాని ఫాస్టాగ్‌, నంబర్ ప్లేట్‌ను గుర్తించి స్కాన్ చేసి. వాహనం వివరాలను గుర్తిస్తాయి. ఆ సమాచారాన్ని నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థకు పంపిస్తాయి. టోల్ మొత్తం ఆటోమేటిక్‌గా పనిచేస్తుంటుంది. ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్ అయినా వాహనం మాత్రం ఆగకుండా ముందుకు ప్రయాణం ముందుకు సాగనుంది. అంటే.. నో బూత్.. నో బారియర్.. నో వెయిటింగ్.. జస్ట్.. డ్రైవ్ చేయాల్సి ఉంటుంది.

ఫాస్టాగ్‌లో డబ్బులు లేకపోతే..

ఫాస్టాగ్‌లో డబ్బులు లేకపోయినా ప్రయాణం చేయవచ్చు. RFID రీడర్ ఫాస్టాగ్‌ను గుర్తించలేకపోయినా.. హై-రిజల్యూషన్ కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేస్తాయి. వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా టోల్ లావాదేవీ నమోదు అవుతుంది. తక్కువ బ్యాలెన్స్ ఉన్నట్లయితే వాహనదారుడికి 24 గంటల గడువు ఇచ్చి ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకుని టోల్ చెల్లించే అవకాశం కల్పించే విధానం ఉంటుంది. ఆ గడువులో చెల్లించకపోతే.. ఈ-నోటీస్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

తెలంగాణలో 11 టోల్ ప్లాజాలు..

ఈ కొత్త టెక్నాలజీ తెలంగాణ జాతీయ రహదారులపైనా అడుగుపెట్టబోతుంది. ఇందుకోసం రాష్ట్రంలోని 11 టోల్ ప్లాజాలను ఇందుకోసం ఎంపిక చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. కంపెనీల ఎంపిక ప్రక్రియ పూర్తయితే మరో ఐదారు నెలల్లో కొత్త విధానం అమల్లోకి వచ్చేలా కసరత్తు జరుగుతోంది.

గుజరాత్‌లో ప్రయోగం.. ఇప్పుడు తెలంగాణలో విస్తరణ..

ఈ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ విధానం దేశంలో తొలుత గుజరాత్‌లోని NH-48పై చోరయాసి టోల్ ప్లాజా వద్ద ప్రయోగాత్మకంగా చేపట్టారు. అక్కడి అనుభవాల ఆధారంగా దేశంలోని మరిన్ని జాతీయ రహదారులపై ఈ విధానాన్ని విస్తరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. తెలంగాణతోపాటు రాజస్థాన్.. ఢిల్లీ.. మహారాష్ట్ర.. తదితర ప్రాంతాల్లో దశలవారీగా ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు.

Follow Us
ఇది కదా కావాల్సింది.. టోల్ బూత్‌లకు గుడ్‌బై.. ఇక రయ్ రయ్ అంటూ..
ఇది కదా కావాల్సింది.. టోల్ బూత్‌లకు గుడ్‌బై.. ఇక రయ్ రయ్ అంటూ..
పోస్టాఫీస్ ద్వారా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవడం ఎలా..?
పోస్టాఫీస్ ద్వారా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవడం ఎలా..?
మైదానంలోనే పొట్టుపొట్టుగా తిట్టుకున్న ప్లేయర్లు..!
మైదానంలోనే పొట్టుపొట్టుగా తిట్టుకున్న ప్లేయర్లు..!
గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ప్రముఖ క్రికెటర్ బ్యాట్లు చోరీ
గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ప్రముఖ క్రికెటర్ బ్యాట్లు చోరీ
నవరాత్రుల్లో అరుదైన త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు జాక్ పాట్
నవరాత్రుల్లో అరుదైన త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు జాక్ పాట్
పిడుగులు, ఈదురుగాలుల ముప్పు.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందో
పిడుగులు, ఈదురుగాలుల ముప్పు.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందో
థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న మూవీ..
థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న మూవీ..
కోడి ముందా.. గుడ్డు ముందా? వెయ్యేళ్ల ప్రశ్నకు సైంటిస్టుల ఆన్సర్!
కోడి ముందా.. గుడ్డు ముందా? వెయ్యేళ్ల ప్రశ్నకు సైంటిస్టుల ఆన్సర్!
బ్రెడ్‌, జామ్‌ తిన్న కుటుంబం.. తెల్లాసరికల్లా విషాదం!
బ్రెడ్‌, జామ్‌ తిన్న కుటుంబం.. తెల్లాసరికల్లా విషాదం!
GATE 2027 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పెరిగిందోచ్.. ఎప్పటివరకంటే?
GATE 2027 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పెరిగిందోచ్.. ఎప్పటివరకంటే?