AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GATE 2027 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పెరిగిందోచ్.. ఎప్పటివరకంటే?

ఐఐటీల్లో 2027-28 విద్యా సంవత్సరానికి ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE 2027) పరీక్ష దరఖాస్తుల తుది గడువును ఐఐటీ మద్రాస్ పొడిగించింది. గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం దరఖాస్తు గడువు సెప్టెంబర్ 27, 2026వ తేదీతో ముగిసింది. అయితే తాజాగా ఆలస్య రుసుముతో..

GATE 2027 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పెరిగిందోచ్.. ఎప్పటివరకంటే?
GATE registration deadline
Srilakshmi C
|

Updated on: Sep 28, 2026 | 2:21 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్ 28: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో 2027-28 విద్యా సంవత్సరానికి ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE 2027) పరీక్ష దరఖాస్తుల తుది గడువును ఐఐటీ మద్రాస్ పొడిగించింది. గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం దరఖాస్తు గడువు సెప్టెంబర్ 27, 2026వ తేదీతో ముగిసింది. అయితే తాజాగా ఆలస్య రుసుముతో అక్టోబరు 5, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు సెప్టెంబరు 27తో ముగిసింది. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులుంటే అక్టోబరు 14 నుంచి 21 వరకు సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు జనవరి 4, 2027వ తేదీన విడుదల చేస్తారు. పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో జరగనున్నాయి.

గేట్‌ 2027 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాగా గేట్‌ దరఖాస్తు చేసే అభ్యర్థులు డిజిలాకర్‌ ఖాతాతో లింక్‌ చేయడం తప్పనిసరని ఇప్పటికే ఐఐటీ మద్రాస్‌ తెలిపిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసే ముందే అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ డిజిలాకర్‌ ఖాతాను క్రియేట్‌ చేయడం లేదంటే అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో దరఖాస్తుదారులు తమ డిజిలాకర్‌ను అనుసంధానం చేయాలని, దీనివల్ల ధ్రువీకరించిన వ్యక్తిగత సమాచారాన్ని పోర్టల్ సురక్షితంగా సేకరించగలుగుతుందని ఐఐటీ మద్రాస్‌ ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచించింది. అభ్యర్థి ఒకసారి అనుమతి ఇచ్చాక వారి పేరు, పుట్టిన తేదీ, ప్రొఫైల్‌ ఫొటో, వెరిఫైడ్‌ గుర్తింపు పత్రం నంబర్‌, ఈ మెయిల్‌ అడ్రస్‌, మొబైల్‌ నంబర్‌, ఇంటి అడ్రస్‌ వంటి వ్యక్తిగతమైన వివరాలను ఆటోమేటిక్‌గా పోర్టల్‌ సేకరిస్తుందని తెలిపింది. తద్వారా అప్లికేషన్‌ ప్రక్రియ వేగంగా, మరింత కచ్చితంగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అండర్ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్ధులతోపాటు ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్‌/ సైన్స్‌/ కామర్స్/ ఆర్ట్స్/ హ్యుమానిటీస్‌ వంటి సబ్జెక్టులో డిగ్రీ కలిగిన వారు కూడా గేట్‌ 2027కు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌ అభ్యర్ధులు ఆలస్య రుసుమ రూ.2500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు రూ.1500 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష మొత్తం 30 పేపర్లకు ఉంటుంది. అభ్యర్ధులు ఏదైనా ఒకటి లేదా రెండు పేపర్లకు పరీక్ష రాయవచ్చు. ఈ ఏడాది కొత్తగా రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ పేపర్‌ చేరింది. అలాగే ఒక పేపర్‌గా ఉన్న టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఫైబర్‌ సైన్స్‌ను ఇంజినీరింగ్‌ సైన్సెస్‌లో ఒక సెక్షనగా చేర్చారు. కాగా గేట్‌ స్కోర్‌ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో నేరుగా ఉద్యోగాలు కల్పిస్తారు. గేట్‌ 2027 స్కోర్‌కు ఫలితాల ప్రకటన తేదీ నుంచి 3 ఏళ్ల పాటు చెల్లుబాటు గడువు ఉంటుంది.

గేట్‌ 2027 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us