శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం ఒక్కరోజే 32,778 మంది దర్శించుకున్నారు. భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా రద్దు చేయగా, అల్పాహారం, మంచి నీరు అందిస్తున్నారు. సాధారణ దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది.