AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెనరా బ్యాంక్‌లో 3,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే బ్యాంక్‌ కొలువు

కెనరా బ్యాంక్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 3,500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..

కెనరా బ్యాంక్‌లో 3,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే బ్యాంక్‌ కొలువు
Canara Bank Apprentice Recruitment
Srilakshmi C
|

Updated on: Sep 28, 2026 | 3:34 PM

Share

ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకు కెనరా బ్యాంక్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 3,500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్‌లో 247, తెలంగాణలో 134, కర్ణాటకలో 581, తమిళనాడులో 391 పోస్టులు ఉన్నాయి.

కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు..

  • ఎస్సీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 553
  • ఎస్టీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 226
  • ఓబీసీ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 845
  • ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 335
  • యూఆర్‌ కేటగిరీలో పోస్టుల సంఖ్య: 1,531

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు 2023 జనవరి 1 నుంచి 2026 సెప్టెంబర్ 1 మధ్య తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. 2026 సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, బీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోసడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.16,650 స్టైపెండ్ చెల్లిస్తారు.

అభ్యర్థుల ఎంపికలో 12వ తరగతి (హెచ్‌ఎస్‌సీ/10+2) లేదా డిప్లొమా మార్కులు, రిజర్వేషన్ నిబంధనలు, స్థానిక భాషా పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు రుసుము కింద సాధారణ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. కెనరా బ్యాంక్‌లో అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే ముందు అర్హులైన అభ్యర్థులు NATS అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం కెనరా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబర్ 1, 2026.
  • దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 17, 2026.
  • అప్రెంటిస్‌షిప్ శిక్షణ కాలం: 1 సంవత్సరం
  • నెలవారీ స్టైపెండ్: రూ.16,650

కెనరా బ్యాంక్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us