Sowmya Rao: నేను వాళ్లలా కాదు.. నాకు అలాంటివి చేతకావు .. సౌమ్యరావు షాకింగ్ కామెంట్స్
జబర్దస్త్ లో రష్మీ గౌతమ్ ప్లేస్ లో కొద్దిరోజులు యాంకర్ గా చేసింది ఈ బ్యూటీ. అయితే యాంకర్ గా చేసిన కొద్దిరోజులకే ఆ షో నుంచి తప్పుకుంది. అయితే యాంకర్ గా సౌమ్యరావు తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది సౌమ్య రావు. సీరియల్స్ తో తన నటనతో ఆకట్టుకున్న ఈ కన్నడ భామ ..
సౌమ్య రావు.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. ప్రముఖ టీవీ షో జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులను అలరించింది. జబర్దస్త్ లో యాంకర్ గా చేసి మెప్పించింది. జబర్దస్త్ లో రష్మీ గౌతమ్ ప్లేస్ లో కొద్దిరోజులు యాంకర్ గా చేసింది ఈ బ్యూటీ. అయితే యాంకర్ గా చేసిన కొద్దిరోజులకే ఆ షో నుంచి తప్పుకుంది. అయితే యాంకర్ గా సౌమ్యరావు తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది సౌమ్య రావు. సీరియల్స్ తో తన నటనతో ఆకట్టుకున్న ఈ కన్నడ భామ .. యాంకర్ గా మాత్రం రాణించలేకపోయింది. సౌమ్య రావు యాంకరింగ్ పై చాల విమర్శలు వచ్చాయి. చాలా మంది ఆమెను ట్రోల్ కూడా చేశారు.
జబర్దస్త్ వల్ల అనసూయ, రష్మీ విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. అలాగే సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకున్నారు ఈ బ్యూటీస్. అలాగే సౌమ్య రావు కూడా క్రేజ్ సొంతం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ అమ్మడు విమర్శలు ఎదుర్కొంది. తన పై వచ్చిన విమర్శల గురించి సౌమ్య రావు మాట్లాడింది. తన గురించి చాలా మంది దారుణంగా మాట్లాడారని, ఇష్టమొచ్చినట్టు తిట్టారని, పాత యాంకర్లను చూసి నేర్చుకో అని కామెంట్స్ చేశారని తెలిపింది సౌమ్య.
నువ్వు యాంకర్ గా పనికిరావు, ఆ యాంకర్ దరిద్రంగా ఉంది, అసహ్యంగా ఉంది, చూడటానికి గ్లామర్ గా లేదు అని కామెంట్స్ చేశారు. ఆడియన్స్ కొంతమంది నన్ను యాంకర్ గా ఒప్పుకున్నారు. కొంతమంది నన్ను ఒప్పుకోలేదు. నా వచ్చి రాని తెలుగును కూడా ఎంజాయ్ చేశారు. ఆమె యాంకర్ ఏంటి.? తెలుగులో చాలా మంది అమ్మాయిలు ఉన్నారుగా ఈమెనే యాంకర్ చెయ్యాలా అని అన్నారు. కొంతమంది నన్ను బాగా సపోర్ట్ చేశారు. నన్ను విమర్శించిన వారిని ఎలా ఇంప్రస్ చెయ్యాలో నాకు తెలియదు అని అన్నారు. నాకన్నా ముందున్నయాంకర్లకు 11, 12 ఏళ్లు అనుభవం ఉంది. నాకు 6,7 నెలలు మాత్రమే అనుభవం ఉంది. ఆ యాంకర్లు డాన్స్ లు బాగా చేస్తారు.. నాకు డాన్స్ రాదు. నేను వాళ్లలా కాదు.. నాకు అవి చేతకావు. అని తెలిపింది. అలాగే తెలుగు కూడా అంతగా రాకపోవడంతో కొన్ని డైలాగ్స్ నాకు అర్ధం అయ్యేవి కావు. సరే కదా అని నేను డాన్స్ క్లాస్ లకుకూడా వెళ్ళాను. డాన్స్ చేయడం వల్ల నేను ఇంకా స్లిమ్ గా అయ్యాను. దాంతో నన్ను డాన్స్ చెయ్యొద్దు అన్నారు. మీరు బాగా తిని లావు అవ్వండి స్టేజ్ పై ఎదో ఒకటి చేసి మ్యానేజ్ చెయ్యొచ్చు అన్నారు అంటూ చెప్పుకొచ్చింది సౌమ్య రావు.
సౌమ్య రావు ఇన్ స్టా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.