AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmi Gautam: ఆ సమస్యలతో బాధపడుతున్నా.. అందుకే ఇలా కనిపిస్తున్నా.. ఓపెన్‌గా చెప్పేసిన జబర్దస్త్ యాంకర్

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ హోస్ట్ గా మరో రియాలిటీ షో ప్రారంభమైంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ది టాప్ తెలుగు ఇన్ ఫ్లూయెన్సర్ అనే ట్యాలెంట్ హంట్ షోకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ షో ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మీ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Rashmi Gautam: ఆ సమస్యలతో బాధపడుతున్నా.. అందుకే ఇలా కనిపిస్తున్నా.. ఓపెన్‌గా చెప్పేసిన జబర్దస్త్ యాంకర్
Jabardasth Anchor Rashmi Gautam
Basha Shek
|

Updated on: Jul 12, 2026 | 1:46 PM

Share

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై ఉన్న టాప్ మోస్ట్ యాంకర్లలో ఆమె కూడా ఒకరు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ, డీ వంటి టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది రష్మీ. ఇక అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది. కాగా ఇప్పుడు రష్మీ మరో రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఆహా ఓటీటీలో టాప్ తెలుగు ఇన్ ఫ్లూయెన్సర్ పేరుతో ట్యాలెంట్ హంట్ షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షోకు మంచు లక్ష్మీ, వైవా హర్షతో పాటు రష్మీ కూడా జ్యూరీగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షో ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మీ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా తన శరీరాకృతిపై వచ్చిన కామెంట్స్ పై ఓపెన్ గా మాట్లాడింది. ఈ ఈవెంట్ లో భాగంగా యాంకర్.. ‘మీరు ఈ మధ్యకాలంలో కాస్త బొద్దుగా, లావుగా కనిపిస్తున్నారు’ అని అడగ్గా రష్మీ ఇలా ఆన్సర్ ఇచ్చింది.

‘నిజం చెప్పాలంటే నాకు ఇలా కనిపించడం అస్సలు ఇష్టం ఉండడం లేదు. కెమెరా ముందు కనిపించే లుక్ వాస్తవానికి భిన్నంగా ఉంటుంది. కెమెరాల వల్ల కూడా కొంతమంది రియల్ కంటే ఇంకా లావుగా కనిపిస్తారు. అయితే నేను ఇలా కనిపించడానికి ప్రధాన కారణం నాకున్న కొన్ని ఆరోగ్య సమస్యలు. ఆ సమస్యల ప్రభావం వల్లే నా శరీరంలో మార్పులు వచ్చాయి. అందుకే ఇప్పుడు కాస్త బొద్దుగా కనిపిస్తున్నాను. అయితే ఈ పరిస్థితి కూడా శాశ్వతం కాదు. ప్రస్తుతం ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి సారించాను. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఫిట్‌గా, స్లిమ్‌గా కనిపించేందుకు ప్రయత్నిస్తాను. గత 20 ఏళ్లుగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. విజయాలు, అపజయాలు రెండింటిని ఫేస్ చేశారు. అయినప్పటికీ ప్రతి అనుభవం నాకు కొత్త పాఠం నేర్పింది. అందుకే జీవితంలో ఎలాంటి కఠిన పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడం అలవాటు అయింది’ అని చెప్పుకొచ్చింది రష్మీ. ప్రస్తుతం ఈ జబర్దస్త్ యాంకర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఆహా ఓటీటీ షో ప్రమోషన్లలో జబర్దస్త్ రష్మీ..

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!