పాపం హీరోయిన్..స్టేజ్‌పైనే ఏడ్చేసింది

సినిమాలలో హీరోయిన్స్‌ది చాలా తక్కువ కెరీర్ ఉంటుంది. త్రిష, నయనతార లాంటి హీరోయిన్స్ లాంటి హీరోయిన్స్‌ని పక్కనబెడితే..దశాబ్ధకాలం పాటు ఇమేజ్‌కి ఎటువంటి బ్రేక్ లేకుండా నటించిన నటీమణులు చాలా అరుదు. కానీ కొంతమంది హీరోయిన్స్‌కి ఫేట్ కలిసిరాదో, ఏమో తెలియదు కానీ..అందం, అభినయం ఉన్నా కూడా ఎక్కువకాలం సిల్వర్ స్రీన్‌పై సత్తా చాటలేకపోతున్నారు. ఆ కోవకే చెందుతారు యువ హీరోయిన్ శాన్వి శ్రీవాస్తవ. . ‘లవ్లీ’,  ‘అడ్డా’,  ‘రౌడీ’ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:56 pm, Thu, 19 December 19
పాపం హీరోయిన్..స్టేజ్‌పైనే ఏడ్చేసింది

సినిమాలలో హీరోయిన్స్‌ది చాలా తక్కువ కెరీర్ ఉంటుంది. త్రిష, నయనతార లాంటి హీరోయిన్స్ లాంటి హీరోయిన్స్‌ని పక్కనబెడితే..దశాబ్ధకాలం పాటు ఇమేజ్‌కి ఎటువంటి బ్రేక్ లేకుండా నటించిన నటీమణులు చాలా అరుదు. కానీ కొంతమంది హీరోయిన్స్‌కి ఫేట్ కలిసిరాదో, ఏమో తెలియదు కానీ..అందం, అభినయం ఉన్నా కూడా ఎక్కువకాలం సిల్వర్ స్రీన్‌పై సత్తా చాటలేకపోతున్నారు. ఆ కోవకే చెందుతారు యువ హీరోయిన్ శాన్వి శ్రీవాస్తవ. .

‘లవ్లీ’,  ‘అడ్డా’,  ‘రౌడీ’ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ తర్వాత పెద్దగా సందడి చేయలేదు. ఒక ఏడాది నుంచి ఆమె ఖాళీగానే ఉంటుంది. ఆ తర్వాత కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పిలుపొచ్చింది. చాలా కొద్ది మార్కెట్ ఉండే కన్నడ సినిమాల్లో నటించినా..అది బాగా హిట్టయితే తప్ప వారికి అనుకున్న గుర్తింపు దప్పదు. అయితే అమ్మడికి ఇది లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకుంటే, కన్నడలో మంచి ఫామ్‌లో ఉన్న రక్షిత్ శెట్టి (హీరోయిన్ రష్మిక మందనా మాజీ ప్రియుడు)తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం లభించింది. అంతేకాదు ఈ చిత్రాన్ని తెలుగుతో  ‘అతడే శ్రీమన్నారయణ’ పేరుతో విడుదల చేయబోతున్నారు.  బుధవారం నాడు చిత్ర తెలుగు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ శాన్వి మాట్లాడుతూ ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు.

తనది చిన్న వయసనో, యాక్టింగ్ రాదనో,  అందంగా లేననో తెలీదు కానీ… ‘రౌడీ’ సినిమా తరువాత తెలుగులో ఒక్క అవకాశం కూడా రాలేదని ఆమె వాపోయారు. అవకాశాలు లేక ఎన్నో రాత్రులు కుమిలిపోయానని చెప్పిన శాన్వి..ఏడాదిన్నరపాటు మానసిక సంఘర్షణకు లోనయ్యానని చెప్పి కంటతడి పెట్టారు. తాజాగా ‘అతడే శ్రీమన్నారాయణ’ ద్వారా టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించే అవకాశం వచ్చిందని… ఈ సినిమా హిట్ అయితే  తెలుగులో అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నానని తెలిపారు. కాగా శాన్వి చాలా మంచి నటి అని..తాజా సినిమాలో గుర్తిండిపోయేలా యాక్టింగ్ చేసిందని హీరో రక్షిత్ శెట్టి ఆమెకు మద్దతుగా మాట్లాడారు. ఇక ఫ్యాంటసీ అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కిన ‘అతడే శ్రీమన్నారయణ’ ..డిసెంబర్ 27న  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకులను పలకరించబోతుంది.