రూ 10 కోట్ల ఆఫర్..ఈజీగా రిజెక్ట్ చేసిన మాస్ డైరెక్టర్

టాలీవుడ్ సెన్సేషన్ దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ ట్యాగ్ ఆయనకు పర్మనెంట్‌గా సెట్ అవుతోంది. ఎందుకంటే ఒక డజను ప్లాపులు పడ్డాక కూడా నెక్ట్స్ మూవీతో ఇండస్ట్రీ అదిరిపడే హిట్ ఇవ్వడం పూరికి నైజం. ఆ విషయం రీసెంట్ హిట్ ఇస్మార్ట్ శంకర్‌తో ప్రూవ్ అయ్యింది. ప్రజంట్ ఆయన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఫైటర్ మూవీకి కమిటయ్యారు. ఏ హీరో అయినా సరే పూరి డైరెక్షన్‌లో నటించాలని ఆరాటపడుతుంటారు. ఎందుకంటే..ఆయన హీరో బాడీ లాంగ్వేజ్‌ని పూర్తిగా […]

రూ 10 కోట్ల ఆఫర్..ఈజీగా రిజెక్ట్ చేసిన మాస్ డైరెక్టర్
Ram Naramaneni

| Edited By: SEO Team Veegam

Dec 20, 2019 | 12:36 PM

టాలీవుడ్ సెన్సేషన్ దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ ట్యాగ్ ఆయనకు పర్మనెంట్‌గా సెట్ అవుతోంది. ఎందుకంటే ఒక డజను ప్లాపులు పడ్డాక కూడా నెక్ట్స్ మూవీతో ఇండస్ట్రీ అదిరిపడే హిట్ ఇవ్వడం పూరికి నైజం. ఆ విషయం రీసెంట్ హిట్ ఇస్మార్ట్ శంకర్‌తో ప్రూవ్ అయ్యింది. ప్రజంట్ ఆయన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఫైటర్ మూవీకి కమిటయ్యారు.

ఏ హీరో అయినా సరే పూరి డైరెక్షన్‌లో నటించాలని ఆరాటపడుతుంటారు. ఎందుకంటే..ఆయన హీరో బాడీ లాంగ్వేజ్‌ని పూర్తిగా మార్చేస్తారు. మాస్ ఎలివేషన్స్‌తో సదరు నటుడ్ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తారు. అందుకే యంగ్ హీరో కార్తీకేయ కూడా పూరి దర్శకత్యంలో నటించాలని తెగ తాపత్రయపడుతున్నాడు. తన కోరిక అదే అంటూ బాహాటంగానే చెప్పేస్తున్నాడు. అందుకే పూరికి కేవలం రెమ్యూనరేషన్‌గా రూ 10 కోట్లను ఆఫర్ చేశాడంట ఈ హీరో. మరో రూ. 15 కోట్లను సినిమా బడ్జెట్‌గా పెట్టుకుందామని తన ఫేవరెట్‌ డైరెక్టర్‌కి ప్రపోజల్ పంపాడంట కార్తీకేయ. కానీ పూరి మాత్రం యువ హీరో ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించినట్టు ఫిలిం నగర్ టాక్. ప్రజంట్ బిజీగా ఉండటం వల్లో, లేకపోతే వేరే ఇతర కారణాల వలనో తెలియదు కానీ..పూరి ఈ భారీ ఆఫర్‌ను తిరస్కరించడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా  మారింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu