AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిఖిల్‌కు హీరోయిన్‌ ఫిక్స్.. స్వాతి పాత్రలో కేరళ కుట్టీ..?

ఇటీవల ‘అర్జున్ సురవరం’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. ఈ మూవీ ఇచ్చిన విజయాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తోన్న ఈ హీరో.. త్వరలో కార్తికేయ 2లో నటించబోతున్నాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించబోతున్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2014లో విడుదలై ఘన విజయం సాధించిన కార్తికేయ సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. కాగా ఈ మూవీ కోసం హీరోయిన్‌ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మలయాళ కుట్టీ, అందాల […]

నిఖిల్‌కు హీరోయిన్‌ ఫిక్స్.. స్వాతి పాత్రలో కేరళ కుట్టీ..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 19, 2019 | 10:12 PM

Share

ఇటీవల ‘అర్జున్ సురవరం’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. ఈ మూవీ ఇచ్చిన విజయాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తోన్న ఈ హీరో.. త్వరలో కార్తికేయ 2లో నటించబోతున్నాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించబోతున్న ఈ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2014లో విడుదలై ఘన విజయం సాధించిన కార్తికేయ సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. కాగా ఈ మూవీ కోసం హీరోయిన్‌ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మలయాళ కుట్టీ, అందాల భామ అనుపమను హీరోయిన్‌గా తీసుకోవాలని చందూ ఆలోచిస్తున్నాడట. దీనిపై ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది.

కార్తికేయలో స్వాతి రెడ్డి హీరోయిన్‌గా నటించగా.. ఆమె పాత్ర పక్కింటి అమ్మాయిలా తీర్చిదిద్దాడు చందూ. ఇక రెండో భాగంలోనూ హీరోయిన్‌ది అలాంటి పాత్రనే కాగా.. అందుకు అనుపమ సరిగ్గా సెట్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ మలయాళ కుట్టీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు టాక్. అయితే చందూ మొండేటి దర్శకత్వం వహించిన ప్రేమమ్(మలయాళ ప్రేమమ్ రీమేక్‌)లో అనుపమ నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? కార్తికేయ 2 ఎప్పుడు ప్రారంభమవుతుంది..? అనే విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow Us
వాట్సప్‌లో ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
వాట్సప్‌లో ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
బెల్లంతో సేమియా పాయసం.. పాలు విరగదు, సేమియా ముక్కలవ్వదు
బెల్లంతో సేమియా పాయసం.. పాలు విరగదు, సేమియా ముక్కలవ్వదు
చెక్క చెప్పులు పోయాయని ChatGPTనే అడిగాడు..!
చెక్క చెప్పులు పోయాయని ChatGPTనే అడిగాడు..!
నాగలోకం నిజంగా ఉందా? పురాణాల్లో వర్ణించిన సర్పరాజుల రహస్య ప్రపంచం
నాగలోకం నిజంగా ఉందా? పురాణాల్లో వర్ణించిన సర్పరాజుల రహస్య ప్రపంచం
కన్యారాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే!
కన్యారాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే!
బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? అసలుకే ఎసరు వస్తుంది
బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? అసలుకే ఎసరు వస్తుంది
ఢిల్లీ అక్షర్‌ధామ్‌లో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఢిల్లీ అక్షర్‌ధామ్‌లో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఒక్కో ఈవెంట్‏‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్
ఒక్కో ఈవెంట్‏‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్
సరిహద్దుల వీరుడికి ఆకాశ మార్గంలో త్రివర్ణం..!
సరిహద్దుల వీరుడికి ఆకాశ మార్గంలో త్రివర్ణం..!
పీఎఫ్ ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. ఆ పరిమితి రూ.3 వేలకు పెంపు..
పీఎఫ్ ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. ఆ పరిమితి రూ.3 వేలకు పెంపు..