Krishna Vamsi: కోటాతో జరిగిన గొడవలో తనదే తప్పని ఒప్పుకున్న కృష్ణవంశీ.. ఆవేశపడ్డానంటూ

అప్పట్లో నటుడు కోటా, దర్శకుడు కృష్ణ వంశీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకర్ని ఒకరు పర్సనల్‌గా అటాక్ చేసుకున్నారు. ఆ తర్వాతి కాలంలో ఆ గ్యాప్ క్లియర్ అయ్యింది. కలిసి సినిమాలు కూడా చేశారు. అప్పటి గొడవకు మూలం ఏంటో తెలుసుకుందాం పదండి...

Krishna Vamsi:  కోటాతో జరిగిన గొడవలో తనదే తప్పని ఒప్పుకున్న కృష్ణవంశీ.. ఆవేశపడ్డానంటూ
Krishna Vamsi - Kota Srinivasa Rao
Follow us

|

Updated on: Apr 23, 2023 | 1:48 PM

టాలీవుడ్‌లో దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావు. ఏ పాత్ర ఇచ్చినా అందులో జీవిస్తారు. మెప్పిస్తారు. ఆయన టాప్ క్లాస్ యాక్టర్ అని అందరూ ఒప్పుకుంటారు కూడా. ఇక తెలుగు దర్శకులలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న దర్శకుడు కృష్ణ వంశీ. క్రియేటివ్ డైరెక్టర్ అని ఆయన్ను కీర్తిస్తారు సినీ జనాలు.  కల్ట్ క్లాసిక్ చిత్రాలను కృష్ణ వంశీ ఇండస్ట్రీకి అందించారు. అందిస్తున్నారు. అయితే నటుడు కోటా, దర్శకుడు కృష్ణ వంశీ మధ్య గతంలో ఓ వివాదం చెలరేగింది. అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా కృష్ణ వంశీ మాట్లాడుతూ తెలుగునాట ఎక్కువ మంది ఆర్టిస్టులు లేరు.. నటీనటుల కొరత ఉందని… ఇంకా ఎక్కువ మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కావాలి అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఏడాదికి 60, 70 సినిమాలు చేస్తుంటే.. అన్నింటికి 6, 7 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే ఉన్నారని  కృష్ణవంశీ పేర్కొన్నారు.

ఈ మాటలను కాస్త సీరియస్‌గా తీసుకున్నారు కోటా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్టిస్టులు లేరని కృష్ణ వంశీ ఎలా మాట్లాడాతాడని ఫైరయ్యారు. అప్పుడు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ సమయంలో తనను కాస్త పర్సనల్‌గా మాటలు అనేసరికి.. నేను కూడా అలానే రిప్లై ఇవ్వాల్సి వచ్చిందని కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తర్వాత కోటా గారికి సారీ చెప్పి.. ఆ గ్యాప్ క్లియర్ చేసుకున్నట్లు చెప్పారు. ఆ సమయంలో తాను కొంచెం తొందర పడ్డందుకు పశ్చాతాప పడినట్లు తెలిపారు. ఆ గొడవలు సర్దుకున్నాకే ఆయనతో రాఖీ సినిమాలో కలిసి పని చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగానే మాట్లాడిన కృష్ణ వంశీ..కోటా గారితో తన జర్నీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి సాగుతుందని తెలిపారు. ఆయన ఓ అద్భుత నటుడని.. ఆయన్ను చూసి నేర్చుకోవాలని తాను పలువురు నటులకు సూచించినట్లు వివరించారు. ఆయన అత్యద్భుతమైన స్కిల్ ఉన్న అతి కొద్దిమంది నటుల్లో కోటా ఒకరని.. ఆయన అంటే తనకు విపరీతమైన గౌరవం ఉందని కృష్ణ వంశీ వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.