Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maisa Abd Elhadi: అభ్యంతరకర పోస్ట్ షేర్ చేసిన నటి.. అరెస్ట్ చేసిన పోలీసులు

హమాస్ మిలిటెంట్లు , ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది మరణించారు. ఈ యుద్ధానికి (ఇజ్రాయెల్-హమాస్ వార్) సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది పాజిటివ్ గా.. కొంతమంది వ్యతిరేకంగాపోస్ట్ లు పెడుతున్నారు. కొందరు సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అభ్యంతరకర రీతిలో పోస్టింగ్‌లు పెట్టినందుకు పలువురిని అరెస్టు చేస్తున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ చేసినందుకు అరబ్-ఇజ్రాయెల్ నటి మైసా అద్బుల్ హదీని సోమవారం అరెస్టు చేశారు పోలీసులు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా […]

Maisa Abd Elhadi: అభ్యంతరకర పోస్ట్ షేర్ చేసిన నటి.. అరెస్ట్ చేసిన పోలీసులు
Maisaabdelhadi
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 27, 2023 | 7:52 AM

హమాస్ మిలిటెంట్లు , ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది మరణించారు. ఈ యుద్ధానికి (ఇజ్రాయెల్-హమాస్ వార్) సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది పాజిటివ్ గా.. కొంతమంది వ్యతిరేకంగాపోస్ట్ లు పెడుతున్నారు. కొందరు సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అభ్యంతరకర రీతిలో పోస్టింగ్‌లు పెట్టినందుకు పలువురిని అరెస్టు చేస్తున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ చేసినందుకు అరబ్-ఇజ్రాయెల్ నటి మైసా అద్బుల్ హదీని సోమవారం అరెస్టు చేశారు పోలీసులు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా పోస్టింగ్‌లు పెట్టారని పోలీసులు ఆరోపించారు.

మైసా అద్బుల్ హదీ ఇజ్రాయెల్‌లోని నజరేత్‌లో నివసిస్తున్నారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడికి సంబంధించిన ఫోటోను మైసా అద్బెల్ హదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో హమాస్ మిలిటెంట్లు బుల్డోజర్లను ఉపయోగించి ఇజ్రాయెల్ సరిహద్దు కంచెను చీల్చుకుంటున్న దృశ్యం ఉంది. ఈ ఫోటోకు ‘లెట్స్ గో బెర్లిన్ స్టైల్’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నవంబర్ 9, 1989 న, మిలియన్ల మంది ప్రజలు బెర్లిన్ గోడను ధ్వంసం చేశారు. దానిని సూచనగా ఉంచుతూ, మైసా అద్బుల్ హదీ ఈ పోస్ట్ చేసారు. బెర్లిన్ కంచెను ధ్వంసం చేసిన విధంగానే ఇజ్రాయెల్ సరిహద్దులను ధ్వంసం చేయాలని రాసుకొచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించారని ఆరోపణలనేపథ్యంలో ఆ నటిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వరుసగా 17 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. 6400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు కూడా స్పందించారు. కొందరు హమాస్ చర్యలను ఖండించారు. మరికొందరు ఇజ్రాయెల్ యుద్ధ నేరాలను విమర్శించారు.

మైసా అద్బుల్ హదీ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మైసా అద్బుల్ హదీ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.