AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దిమాక్ కరాబ్ హిట్..దంచి కొడుతోన్న కలెక్షన్లు

ఎవరు అండీ..మాస్, మసాలా సినిమాలను జనాలు ఆదరించరు అని చెప్పింది. పూరి జగన్నాథ్ కొడితే బాక్సాఫీస్ లెక్కలు సెట్‌ రైట్ అయ్యాయి. మరోసారి మాస్ బోనాంజా అంటే ఏంటో ఈ ఏస్ డైరక్టర్ చేసి చూపిచ్చాడు. మాములుగా లేదు ట్రేడ్ రిపోర్ట్. ఆడియెన్స్ ఎగబడి థియేటర్స్‌కు పరుగులు పెడుతున్నారు. పడినా మళ్లీ, మళ్లీ లేవడం పూరికి అలవాడు. అదే చేసి చూపించాడు మరోసారి. ఇండస్ట్రీ వర్గాల దిమాక్ కరాబ్ అయిపోయింది ‘ఇస్మార్ట్ శంకర్’ దెబ్బకు. ఇక రామ్‌కు […]

దిమాక్ కరాబ్ హిట్..దంచి కొడుతోన్న కలెక్షన్లు
Ram Naramaneni
|

Updated on: Jul 26, 2019 | 5:10 PM

Share

ఎవరు అండీ..మాస్, మసాలా సినిమాలను జనాలు ఆదరించరు అని చెప్పింది. పూరి జగన్నాథ్ కొడితే బాక్సాఫీస్ లెక్కలు సెట్‌ రైట్ అయ్యాయి. మరోసారి మాస్ బోనాంజా అంటే ఏంటో ఈ ఏస్ డైరక్టర్ చేసి చూపిచ్చాడు. మాములుగా లేదు ట్రేడ్ రిపోర్ట్. ఆడియెన్స్ ఎగబడి థియేటర్స్‌కు పరుగులు పెడుతున్నారు. పడినా మళ్లీ, మళ్లీ లేవడం పూరికి అలవాడు. అదే చేసి చూపించాడు మరోసారి. ఇండస్ట్రీ వర్గాల దిమాక్ కరాబ్ అయిపోయింది ‘ఇస్మార్ట్ శంకర్’ దెబ్బకు. ఇక రామ్‌కు తనకు సరైన సినిమా పడితే సాలిడ్ ఫెర్ఫామెన్స్ ఇస్తానని బాక్సాఫీస్ సాక్షిగా నిరూపించాడు

ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే రూ.19 కోట్ల దాకా షేర్ రాబ‌ట్టాల‌ని రిలీజ్ ముంగిట చెప్తే.. అది చాలా పెద్ద టాస్క్ లాగా క‌నిపించింది. పూరి, రామ్ ఇప్పుడున్న ఫాంలో ఈ టార్గెట్ అందుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌నే అనుకున్నారు. కానీ ఈ చిత్రం వారం తిరిగేస‌రికి బ్రేక్ ఈవెన్ సాధించ‌డ‌మే కాదు.. దాని మీద‌ రూ.10 కోట్ల లాభం కూడా తెచ్చి పెట్టి సంచ‌ల‌నం రేపింది.  ఏడు రోజుల్లో ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.29 కోట్లకు పైగా షేర్ రాబ‌ట్టింది. ఒక్క అమెరికాలో మిన‌హా అన్ని చోట్లా ‘ఇస్మార్ట్ శంక‌ర్’ క‌లెక్ష‌న్లు ఊహించ‌ని స్థాయిలో ఉన్నాయి.

తెలంగాణ‌లో ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. వారం రోజుల్లోనే ఏకంగా రూ.11.8 కోట్ల షేర్ రాబ‌ట్టింది. గ్రాస్ వ‌సూళ్లు రూ.20 కోట్ల‌కు చేరువ‌గా ఉండ‌టం విశేషం. ఇక్క‌డ డిస్ట్రిబ్యూట‌ర్ లాభం రూ.4 కోట్లు దాటింది. ఉత్త‌రాంధ్ర‌లో రూ.3 కోట్ల షేర్ సాధించిన ఇస్మార్ట్ శంక‌ర్.. రాయ‌ల‌సీమ‌లో రూ.4.5 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మిగ‌తా ఏరియాల‌న్నీ క‌లిపి షేర్ రూ.7 కోట్లకు పైనే వ‌చ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి రూ.26.5 కోట్ల దాకా షేర్ క‌లెక్ట్ చేసిందీ చిత్రం. ఈ సినిమా ఫుల్ ర‌న్లో రూ.40 కోట్ల షేర్ మార్కుకు చేరువ‌గా వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Follow Us